ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరు సమస్యపై పాకిస్తాన్ ప్రపంచ దేశాల ద్రుష్టికి ఇష్యూని తీసుకొని రచ్చ చేయాలని ప్రయత్నం చేస్తుంది.అయితే కాశ్మీర్ అనేది అంతర్గ్హత సమస్య అని ఆ విషయంలో తాము జోక్యం చేసుకోమని ఇతర దేశాలు తేల్చి చెప్పేసాయి.
ఇక అమెరికా మధ్యవర్తిత్వానికి భారత్ అంగీకరించకపోవడం వారు కూడా చేతులెత్తేశారు.దీంతో ఈ అంశం మీద తమకి న్యాయం చేయాలని ఐక్యరాజ్యసమితి దగ్గరకి పాకిస్తాన్ వెళ్ళింది.
అయితే ఐరాస ఈ వ్యవహారంపై తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు పాకిస్తాన్ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యింది.జమ్మూ-కశ్మీరులో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని పాకిస్థాన్ డిమాండ్ చేస్తూ ఐరాసలో చేసిన తీర్మానంపై భద్రతా మండలి ఆమోదం తెలిపింది.
జమ్మూ-కశ్మీరులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి 3 నిబంధనలను ఏర్పాటు చేసింది.జమ్మూ-కశ్మీరులో సాధారణంగా నివసించని గిరిజనులు, పాకిస్థానీ జాతీయులను అక్కడి మొదటిగా పసంహరించుకోవాలి.గిరిజనులు, పాకిస్థానీలు ఈ రాష్ట్రంలోకి చొరబాట్లను నిలువరించేందుకు, పోరాటాలు చేసేందుకు వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యిపోయి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారు.వీరందరూ దేశం విడిచి వెళ్ళడంతో పటు రాష్ట్రంలో పోరాడుతున్నవారికి సహాయాన్ని అందించరాదని కూడా ఈ నిబంధన తెలిపింది.
పాకిస్థానీ గిరిజనులు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినట్లు భద్రతా మండలి నియమించిన కమిషన్ సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే భారత దేశం తన దళాలను క్రమంగా తగ్గించాలని ఈ నిబంధన తెలిపింది.అయితే ఈ నిబంధన ప్రకారం పాకిస్తాన్ కి రివర్స్ పంచ్ పడుతుంది.
కాశ్మీర్ పై ప్రజాభిప్రాయం జరగాలంటే దేశంలోకి చొరబడ్డ అందరూ దేశం విడిచి వెళ్ళాలి.అలా జరిగితే కాశ్మీర్ మీద పాకిస్తాన్ పట్టు కోల్పోతుంది.
దీంతో ఈ విషయంలో పాకిస్తాన్ ఏమీ చేయలేక సైలెంట్ అయిపొయింది.