వాషింగ్ మిషిన్లు వచ్చిన తరువాత ఎవరూ కూడా చేత్తో బట్టలు ఉతకడం అనేది ఇప్పుడు లేదు.కానీ ఒకప్పుడు ఈ మిషన్ లు ఏమి లేనప్పుడు మన పెద్దలు ఎలా బట్టలు ఉతికేవారు అన్న విషయం కూడా ఈ తరం పిల్లలకు సరిగా తెలియదు అనే చెప్పాలి.
ఎందుకంటే ఈ రోజుల్లో పని మనిషిని పెట్టి బట్టలు ఉతికించుకోవడం కంటే కూడా వాషింగ్ మిషన్ తీసుకొని బట్టలు ఉతుక్కోవడం చాలా చీప్ అని చెప్పాలి.అయితే ఇంతకీ ఈ పురాణం అంతా ఎందుకు అని అనుకుంటున్నారా.
సోషల్ మీడియా లో ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది.ఆ వీడియో చూస్తే మాత్రం పైన చెప్పిన విషయాలు అన్నీ ఒక్కసారి గుర్తుకు రాక మానవు.
ఇంతకీ ఆ వీడియో లో ఏముంది అని అనుకుంటున్నారా.ఆ వీడియో లో ఒక కోతి బట్టలు ఉతుకుతుంది.
ఒకప్పుడు మిషన్ లు లేనప్పుడు ఏవిధంగా అయితే చేత్తో బట్టలు ఉతికే వారో సరిగ్గా అదే విధంగా బట్టలను నానబెట్టి, ఒక్కొక్కటిగా తీసి సబ్బు రాసి మరీ బట్టలు అతికింది.అంతేకాదండోయ్ బట్టలను బండకేసి ఎలా అయితే బాదుతూ ఉతుకుతామో అదే విధంగా నెల కేసి బాదుతూ ఆ బట్టలను ఉతికి,ఆ తరువాత నీళ్ళల్లో ఒకసారి ఆ బట్టను ముంచి మళ్లీ తిరిగి ఉతకడం మొదలుపెట్టింది.
అయితే ఇదంతా కూడా ఎవరో తమ ఫోన్ లో వీడియో తీసినట్లు ఉన్నారు.దాన్ని కాస్త సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.
నెటిజన్లు కూడా ఈ వీడియో పై తెగ కామెంట్లు కూడా పెడుతున్నారు.పోనీ లే ఇలాంటి వీడియోల వల్ల అయినా ఈ తరం వారికి ఒకప్పుడు బట్టలు ఎలా ఉతికేవాళ్లం అన్న విషయం అర్ధం అవుతుంది.
.






