జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి రాజకీయ జీవితం పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నిజంగా ఈ రోజు జనసేన పార్టీ ఓటమి పాలైన తరువాత నేతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడానని,ఆరోజు నా అన్న చిరంజీవి కూడా ఇలానే చేసి ఉంటె ఇప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ ఉండేది అంటూ పవన్ ఆశాభావం వ్యక్తం చేసారు.
అంతేకాకుండా తన అన్న మెతకతనం,ఒత్తిడితోనే ప్రజారాజ్యం పార్టీని నడపలేకపోయారంటూ పవన్ వ్యాఖ్యానించారు.జనసేనకు ప్రస్తుతం అసెంబ్లీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారని భవిష్యత్‌లో ఏపీ అసెంబ్లీ మొత్తం స్థానాలను ఆక్రమించే స్థాయికి తమ పార్టీ చేరుకుంటుందంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ పవన్ పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా అపజయానికి కుంగిపోయి.
విజయానికి పొంగిపోయే వ్యక్తిని తాను కాదని, ప్రతి ఓటు కూడా ఎంతో కీలకమైందని, జనసైనికులంతా పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పవన్ పిలుపునిచ్చారు.

అంతేకాకుండా ప్రజలు నాకు ఓట్లు వేయకపోయినా ప్రజాసమస్యల పరిష్కారానికి తన పోరాటం కొనసాగిస్తానని పవన్ స్పష్టం చేశారు.గత ఎన్నికల్లో జనసేన పేరుతో పార్టీ స్థాపించి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగగా కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకొని ఘోర పరాజయాన్ని చవిచూసింది.అయితే పార్టీ ఓటమి పాలైనా రాజకీయాల్లో మాత్రం కొనసాగుతానని పవన్ స్పష్టం చేశారు.







