‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్‌కు ఇండియా మొత్తం ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రికార్డు స్థాయిలో బాహుబలి వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఇండియాస్ సూపర్ స్టార్‌గా ప్రభాస్ నిలిచాడు.
ఒక తెలుగు హీరో అన్ని భాషల్లో ప్రేక్షకులను తన అభిమానులుగా మల్చుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది.ఇప్పుడు ప్రభాస్‌కు మాత్రమే ఇండియాలోని అన్ని భాషల నుండి అభిమానులు ఉన్నారు.
తమిళ ప్రేక్షకులు పెద్దగా ఇతర భాష హీరోలను అభిమానించరు.

కాని ప్రభాస్ విషయంలో మాత్రం అది రివర్స్‌గా ఉంది.ప్రభాస్‌కు అక్కడ భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అందుకే సాహో చిత్రాన్ని అక్కడ అత్యధికంగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నారు.
ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాహో చిత్రం విడుదల నేపథ్యంలో తమిళ స్టార్ హీరో సూర్య తన బందోబస్తు సినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.మూడు నాలుగు నెలల క్రితమే బందోబస్తు చిత్రాన్ని ఆగస్టు 30 విడుదల చేస్తామని ప్రకటించారు.

ఆగస్టు 15న విడుదల అవ్వాల్సిన సాహో చిత్రం ఆగస్టు 30కి వాయిదా వేయడం జరిగింది.దాంతో బందోబస్తు చిత్రం విడుదల విషయంలో ఇబ్బంది ప్రారంభం అయ్యింది.సాహో చిత్రంకు తెలుగు మరియు తమిళంలో మంచి క్రేజ్ ఉంది.దాంతో సూర్య తన సినిమాను కాస్త ఆపితే బెటర్ అనే నిర్ణయానికి వచ్చాడు.బందోబస్తు చిత్రంను తెలుగులో కూడా భారీగా విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.సాహోతో వస్తే అది సాధ్యం కాదు.
అందుకే కొత్త డేట్‌ను మళ్లీ ప్రకటించే అవకాశం ఉంది.తమిళ స్టార్ హీరో సినిమానే వాయిదా వేసుకునేలా చేసిన సాహో చిత్రంతో ప్రభాస్ రేంజ్ ఏంటో క్లారిటీగా తెలిసి పోయింది కదా.ఇండియా మొత్తం కూడా ప్రభాస్‌కు ఇదే స్థాయి గుర్తింపు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.







