బయటకి వచ్చి బిగ్ బాస్ మీద రచ్చ మొదలెట్టిన హేమ

బిగ్ బాస్ సీజన్ 3కి ఎన్నడూ లేని విధంగా ఆరంభంతోనే వివాదాలు చుట్టుకున్నాయి.బిగ్ బాస్ మాటున కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని యాంకర్, నటి రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేస్తున్నారు.

 Actress Hema Sensation Comments On Big Boss Show-TeluguStop.com

బిగ్ బాస్ కారణంగా దెబ్బ తిన్న తమకి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు.అయితే జనం మాత్రం ఈ వివాదాన్ని పక్కన పెట్టి బిగ్ బాస్ కోసం టీవీలకి అతుక్కుపోతున్నారు.

అయితే బిగ్ బాస్ ఆరంభమై ఒక వారం పూర్తి చేసుకోవడంతో మొదటి ఎలిమినేషన్ గా నటి హేమ బయటకి వచ్చేసింది.

బయటకి వచ్చిన వెంటనే ఆమె బిగ్ బాస్ మీద విమర్శల దాడి చేయడం మొదలెట్టింది.

బిగ్ బాస్ హౌస్ లో తనకి అకారణంగా ఎలిమినేషన్ చేసి బయటకి పంపించేసారని విమర్శించింది.హౌస్ లో జరుగుతుంది ఒకటి అయితే బయటకి చూపించేది ఒకటని చెప్పుకొచ్చింది.

తనకి ఓటింగ్ ఎక్కువగానే ఉన్న తనని ప్లాన్ ప్రకారం బయటకి పంపించారని ఆరోపించింది.వంటగది వల్లే హౌస్ లో గొడవలు వచ్చాయని, అది తీయొద్దు, ఇది తీయొద్దు అని తాను చెప్పడాన్ని కమాండింగ్ గా అర్థం చేసుకున్నారని చెప్పారు.

వాళ్ల కోసం తాను చేస్తున్నది వాళ్లకు అర్థం కాలేదని అందుకే హౌస్ లో ఉండటం అక్కా, అక్కా అని పిలుస్తూనే తనపై లేనిపోని మాటలు చెప్పారని బిగ్ బాస్ మీద ముప్పేట దాడి చేసింది.దీంతో ఇప్పుడు బిగ్ బాస్ వివాదానికితోడు హేమ కారణంగా మరో కాంట్రవర్సీ మూటగట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube