డిస్కవరీ చానల్ లో మోడీ సాహసాలు! కచ్చితంగా చూడాల్సిందే

ఇండియాని పరిపాలించిన ప్రధానమంత్రులలో అందరికంటే ప్రత్యేకమైన శైలి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీది.ఓ వైపు తన రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు, మాటలతో ప్రత్యర్ధులకి చెమటలు పట్టించి, ప్రజల మన్ననలు అందుకునే మోడీ, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చాలా వేగంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటాడు.

 Pm Modi To Feature In Discovery Channels Man Vs Wild1-TeluguStop.com

ఎవరు ఏం అనుకుంటారు అనే ఆలోచన కూడా రాకుండా అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మోడీ దిట్ట.అదే సమయంలో యోగాని ఇప్పుడు ప్రపంచం మొత్తం వరల్డ్ యోగా డే క్రింద చేసుకోవడానికి ప్రధాన కారణం మోడీ.

ఇలా వినూత్న పంథాలో తన ప్రయాణం ఉండేలా చూసుకునే మోడీ తాజాగా డిస్కవరీ ఛానెల్ ప్రసారం చేసే పాపులర్ షో మేన్ వర్సెస్ వైల్డ్‌లో కనిపించబోతున్నారు.ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆ ఛానెల్ రిలీజ్ చేసింది.

ఆగస్ట్ 12న మోదీ ప్రపంచ ప్రముఖ సాహసవీరుడు బియర్ గ్రిల్స్‌తో కలిసి చేసిన జర్నీని డిస్కవరీ ఛానెల్ చూపించబోతోంది.ఇందుకు సంబంధించి బియర్ గ్రిల్స్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియో షేర్ చేసాడు.

మోదీ తనతో కలిసి ఎలాంటి సాహసాలు చేశారో 180 దేశాల వారు చూడాలని కోరాడు.మోదీలో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నట్లు చెప్పి ఈ షో మీద ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసాడు.

మరి ఇప్పుడు ప్రధాని మోడీ కారణంగా ఇండియా మొత్తం ఆ షో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube