అమెరికాలో మళ్ళీపేలిన తూటా..

అమెరికాలో తుపాకీ సంస్కృతి హెచ్చు మీరుతోంది.గడించిన నెల కాలంలోనే దాదాపు 3 మార్లు తుపాకీ తూటాలకి అమాయక జనం బలైన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

 1shotneara Brooklynplayground-TeluguStop.com

తాజాగా అమెరికాలోని బ్రూక్లిన్ ప్లే గ్రౌండ్ లో అర్ధరాత్రి జరిగిన కాల్పుల ఘటనలో దాదాపు 12 మంది తీవ్ర గాయాలపాలవ్వగా మరొకరు మృతి చెందారు.ఈ ఘటన తెల్లవారు జామున 3.30 గంట ప్రాంతంలో జరిగినట్టుగా తెలుస్తోంది.

అమెరికాలో మళ్ళీపేలిన తూటా Telugu

ఒక్క సారిగా సంఘటన ప్రాంతానికి వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.38 ఏళ్ళ యువకుడు ఈ ప్రమాదంలో తీవ్ర రక్త స్రావంతో కొట్టుమిట్టాడుతున్న క్రమంలో స్థానికంగా ఉన్న వారు ఆసుపత్రికి తరలించే క్రమంలోనే కన్ను మూసినట్టుగా తెలుస్తోంది.అయితే ఈ ఘటనకి సంభందించి పోలీసులు ఇప్పటి వరకూ ఎవరిని అదుపులోకి తీసుకోలేదని స్థానిక మీడియా పేర్కొంది.

న్యూయార్క్‌ కి అతి సమీపంలో ఉన్న బ్రౌన్స్‌విల్లే లో తుపాకీ సంస్ర్కుతి హెచ్చుమీరుతోంది.ఈ పరిస్థితుల్ని నిరోధించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేకపోయాయి.దాంతో ప్రభుత్వం ఆ ప్రాంతానికి అధిక భద్రతని కల్పించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube