అమెరికాలో టాలీవుడ్ సింగర్ కి అరుదైన గౌరవం..

అమెరికాలోని న్యూజెర్సీ లో సౌత్ ఏషియన్ ఫెస్ట్ అత్యంత వైభవంగా కన్నుల పండుగలా జరిగింది.ఈ ఈవెంట్ లో టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత టీమ్ ఎంతో అత్యద్భుతమైన ప్రదర్శనని ప్రదర్శించారు.

తన టీమ్ ఆలపించిన పాటలు తెలుగు ఎన్నారైలని విశేషంగా ఆకట్టుకున్నాయి.ఎన్నారైలని ఈ విభావరి పరవశింప చేసిందనే చెప్పాలి.ఇదిలాఉంటే

అమెరికాలో టాలీవుడ్ సింగర్ కి

సింగర్ సునీతతో పాటు మరి కొందరు గాయనీ గాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.వీరిలో అనురుద్, శ్రుతి కూడా పాల్గొని, తమ గానామృతంతో అందరిని ఉశ్చాహ పరిచారు.జబర్దస్త్ ఫేం తో మాంచి క్రేజ్ సంపాదించికున్న అనసూయ ఈ ఈవెంట్ మొత్తానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

అమెరికాలో టాలీవుడ్ సింగర్ కి

ఎన్నారైలని తనదైన స్టైల్ లో ఎంటర్టైన్మెంట్ చేసింది అనసూయ.ఈ కార్యక్రమం అనంతరం సింగర్ సునీతకి న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ స్పెషల్ హానర్ లభించినట్టుగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ , తనకి ఈ విధమైన గౌరవం లభించడం ఎంతో సంతోషంగా ఉందని.

ఎన్నారైలు అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube