తధాస్తు దేవతలు ఉంటారు అని పెద్దలు అనే మాట అప్పుడప్పుడు నిజమనిపిస్తుంది.వాస్తవంగా జరిగే కొన్ని సంఘటనలు చూసినపుడు కచ్చితంగా నమ్మాలి అనిపిస్తుంది.
యాదృస్చికంగా జరిగిన కూడా ఇలాంటి సంఘటనలు అందరిని ఆకర్షిస్తాయి.తాజాగా అలాంటి సంఘటన తమిళనాడులో అందరిని ఆకట్టుకుంది.
సినిమా కథలో భాగంగా చనిపోయిన ఓ నటుడు ప్రమోషన్‌లో భాగంగా తాను చనిపోయినట్టు శ్రద్ధాంజలి పోస్టర్లు వేయించిన వారం రోజులలో నిజంగానే చనిపోయాడు.ఈ సంఘటన తూత్తుకుడి జిల్లాలో జరిగింది.
అసలు విషయంలోకి వెళ్తే
తూత్తుకూడి జిల్లా కాయల్‌పట్టినంకు చెందిన ఆర్‌ఎస్ గోపాల్ ఓ చిరు వ్యాపారి.తన వ్యాపారానికి సంబంధించి వినూత్న ప్రచారంతో స్థానికంగా చాలా ఫేమస్ అయ్యాడు.
ఇటీవల అతడి ఓ తమిళ సినిమాలో విలన్‌గా తీసుకున్నారు.ఆ సినిమాలో అతడు చనిపోయే సీన్ ఉంది.
దీంతో వీధుల్లో ‘శ్రద్ధాంజలి’ పోస్టర్లు అంటించి షూటింగ్ చేశారు.సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆ ‘శ్రద్ధాంజలి’ పోస్టర్లను గోపాల్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
అవి చూసిన బంధువులు, స్నేహితులు షాకయ్యారు.గోపాల్ సినిమా కోసం అలా చేసాడని రిలాక్స్ అయ్యారు.
అయితే మళ్ళీ వారం రోజుల వ్యవధిలో మరోసారి గోపాల్ శ్రద్ధాంజలి పోస్టర్స్ సోషల్ మీడియాలో కనిపించాయి.ఈ సారి కూడా అతని ప్రచారం అని ముందు అనుకున్న, ఎందుకనో డౌట్ వచ్చిఇంటికి ఫోన్ చేయగా అతను అనారోగ్యంతో చనిపోయాడనే విషయం తెలిసింది.
అలా వారం క్రితం సరదాగా అంటించిన పోస్టర్స్ ఇప్పుడు నిజం అయ్యానని తమిళ మీడియాలో చెప్పుకుంటున్నారు.ఇప్పుడు స్థానికంగా అందరూ ఇదే విషయం మీద చర్చించుకుంటున్నారు.
గోపాల్ తన చావుకి తానే పోస్టర్స్ అంటించుకున్నాడు అని చెప్పుకుంటున్నారు.







