అనసూయకు డబ్బులు ఎక్కువయ్యాయా?

హాట్‌ యాంకర్‌ అనసూయ వెండి తెరపై ఈమద్య ఎక్కువ అవకాశాలను దక్కించుకుంటుంది.ఈ సమయంలోనే ఆమె జబర్దస్త్‌కు గుడ్‌ బై చెప్పే అవకాశాలున్నాయంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 Anchor Anasuya About Producing In The Movies-TeluguStop.com

నటిగానే ఫుల్‌ టైం కొనసాగాలని అనసూయ భావిస్తోంది.బుల్లి తెరపై కంటే వెండి తెరపై ఎక్కువగా స్కోప్‌ ఉన్న కారణంగా ఇకపై వెండి తెరపైనే తన పూర్తి టైంను గడపాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా అనసూయ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

అనసూయకు డబ్బులు ఎక్కువయ్యాయా

అనసూయ తాజాగా అమెరికాలోని తానా వేడుకల్లో పాల్గొంది.అక్కడ తెలుగు వారు నిర్వహించిన వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనసూయ ఆ వేడుకలో మాట్లాడుతూ తాను భవిష్యత్తులో సినిమాలను నిర్మించబోతున్నట్లుగా ప్రకటించింది.కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

కొత్త వారిని తన సినిమా ద్వారా పరిచయం చేసే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా పేర్కొంది.కోటి నుండి రెండు కోట్ల వరకు ఈమె బడ్జెట్‌ పెట్టనుందట.

అనసూయకు డబ్బులు ఎక్కువయ్యాయా

ఎంతో మంది నిర్మాణంలోకి వచ్చి చేతులు కాల్చుకున్నారు.ఇలాంటి సమయంలో అనసూయ కూడా సినిమా నిర్మాతగా మారడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.వెబ్‌ సిరీస్‌లను మరియు సినిమాలను నిర్మించడంపై ఈమద్య కాలంలో చాలా మంది ఆసక్తి కనబర్చుతున్నారు.మరి వారి దారిలోనే అనసూయ కూడా రాబోతుంది.యాంకర్‌గా గుడ్‌ బై చెప్పడంను చాలా మంది తప్పుబడుతున్నారు.ఇప్పుడు నిర్మాణంలోకి వెళ్లడంపై కూడా విమర్శలు చేస్తున్నారు.

మరీ అంతగా డబ్బులు ఎక్కువ అయ్యాయా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube