బేబీ మీద కోటి ఆశలు పెట్టుకున్న అక్కినేని కోడలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని నాగార్జున కోడలు సమంత ఇప్పుడు ఓ బేబీ సినిమా ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉంది.

ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసిన సమంత పెళ్లి తర్వాత స్టార్ హీరోలకి జోడీగా కంటే సోలోగా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది.

అందులో భాగంగానే యూటర్న్, రాజుగారి గది 2, లాంటి సినిమాలు చేసింది.అయితే దురదృష్ట కొద్ది ఆ రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో సమంత నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రాలేదు.

అయితే మజిలీ సినిమా మెజారిటీ క్రెడిట్ మొత్తం సమంత తీసుకొంది.ఆ సినిమా హిట్ తో భార్య, భర్తలు ఇద్దరు మంచి ఊపులోకి వచ్చారు.

ఇదిలా ఉంటే సమంత ఇప్పుడు మరో సారి సోలోగా తన మార్క్ చూపించడానికి ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యింది.ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది.

Advertisement

దీంతో సినిమా ప్రమోషన్ మీద ఎక్కువగా ద్రుష్టి పెట్టిన సమంత అన్ని తానై సినిమాని జనాల్లోకి తీసుకెళ్తుంది.నాగశౌర్య ఉన్న కూడా అతను పాత్ర గెస్ట్ అపీరియన్స్ మాత్రమే కావడంతో అతను సినిమా ప్రమోషన్ లో పాల్గొనడం లేదు.

దీంతో ఓ బేబీ సినిమా బారం అంతా సమంత మీద పడింది.ఇక ఈ సినిమాతో మరో సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకుంటా అనే గట్టి నమ్మకంతో ఈ భామ ఉంది.

ఒక వేళ హిట్ కాకుంటే కొంత కాలం సోలో స్టోరీస్ కి కామా పెట్టె అవకాశాలు ఉన్నాయని టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు