సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా కథ మొదలవ్వగానే పక్షిలా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొట్టడం చాలా కామన్.ఒక హీరో ఒప్పుకోకపోతే మరో హీరో అన్నట్టుగా దర్శకులు వారికి నచ్చిన కథలను తెరకెక్కిస్తున్నారు.
గతంలో అల్లు అర్జున్ కోసం రాసిన కథ కూడా అదే తరహాలో ఇప్పుడు మరో హీరోకి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది.

ఆ హీరో మరెవరో కాదు జీనియస్ సినిమాతో ఓంకార్ అన్నయ్య పరిచయం చేసిన హవిష్.లింగుస్వామి డైరెక్ట్ చేయబోయే ద్విభాషా చిత్రంలో హవిష్ సరికొత్తగా కనిపించబోతున్నాడు.పందెం కోడి – ఆవారా సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న లింగుస్వామి ఆ తరువాత అల్లు అర్జున్ తో బైలింగ్యువల్ మూవీ తీయాలని అనుకున్నాడు.

కానీ సంవత్సరాలు గడిచినా మళ్ళీ ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు.బన్నీ కోసం అప్పుడెప్పుడో రాసుకున్న మాస్ కథను ఇప్పుడు దర్శకుడు హవిష్ కి షిఫ్ట్ చేశాడు.మాస్ లుక్ లో యువ హీరో సరికొత్తగా అటు తమిళ్ ఆడియెన్స్ ని ఇటు తెలుగు ఆడియెన్స్ ని మెప్పిస్తాడట.మరి అల్లు అర్జున్ వద్దన్న ఆ కథ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.







