లక్‌ అంటే ఇతడిదే : ఉద్యోగం లేక అవస్థలు పడుతున్న వ్యక్తికి ఒక్క ట్వీట్‌తో ఒకేసారి పది సంస్థలు ఆఫర్‌ ఇచ్చాయి

ఇండియాలో మంచి ఉద్యోగం లభించక, బతుకుదెరువు కోసం అప్పుచేసి అరబ్‌ దేశాలు వెళ్లే వారు ఎంతో మంది ఉంటారు.అక్కడ చేసేది చిన్న ఉద్యోగమే అయినా కూడా వచ్చేది డాలర్లు అవ్వడం వల్ల ఇక్కడికంటే అక్కడ బాగా బతికేయవచ్చు అంటూ అంతా భావిస్తారు.

 Jobless India Man Rajesh In Dubai Got 10 Job Offers1-TeluguStop.com

అందుకే ఇండియాకు చెందిన పలు వెనకబడిన ప్రాంతాల వారు దుబాయి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.అయితే అక్కడకు వెళ్లిన తర్వాత వారి గోసలు మామూలుగా ఉండవు.

అత్యంత దయనీయ పరిస్థితిని వారు ఎదుర్కోవడం మనం ఇప్పటి వరకు చూశాం.

లక్‌ అంటే ఇతడిదే : ఉద్యోగం లేక

తాజాగా యూఏఈలో రాజేష్‌ అనే వ్యక్తి అష్ట కష్టాలు పడ్డాడు.ఏడు లక్షలు బ్యాంకులోను తీసుకుని బతుకు దెరువు కోసం యూఏఈ వెళ్లిన అతడికి అక్కడ మంచి ఉద్యోగం లభించలేదు.ఒక చిన్న సూపర్‌ మార్కెట్‌లో జాబ్‌ చేస్తే వచ్చే జీతం అక్కడ అతడి మెయింటెన్స్‌కు సరిపోయేది.

దాంతో ఆ జాబ్‌ మానేసి మరోజాబ్‌ వెదుక్కోవాలనుకున్నాడు.జాబ్‌మానేసిన రాజేష్‌కు మరో జాబ్‌ లభించడం ఇబ్బంది అయ్యింది.

ఉన్న ఉద్యోగం వదిలేయడంతో రూం ఖర్చులు మరియు అక్కడ మెయింటెన్స్‌ చాలా కష్టం అయ్యింది.స్నేహితుల సాయంతో తన బతుకును వెళ్లదీస్తూ వచ్చాడు.

లక్‌ అంటే ఇతడిదే : ఉద్యోగం లేక

తన దయనీయమైన పరిస్థితిని ట్విట్టర్‌లో ఈనెల 5వ తారీకున పోస్ట్‌ చేశాడు.ఆ ట్వీట్‌లో ఇండియన్‌ విదేశాంగశాఖను ట్యాగ్‌ చేశాడు.రాజేష్‌ ట్వీట్‌ను చూసిన భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళిధరన్‌ చూసి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.యూఏఈలో ఉన్న ఇండియన్‌ రాయబార కార్యలయంకు అతడి విషయాన్ని చెప్పడంతో అక్కడి వారి విజ్ఞప్తి మేరకు పది కంపెనీలు అతడికి ఉద్యోగంను ఆఫర్‌ చేశాయి.

దాంతో అతడు సంతోషంతో మునిగి పోయాడు.పది జాబ్‌లలో మంచి జాబ్‌ను చూసుకుని జాయిన్‌ కాబోతున్నాడు.తనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మంత్రికి రాజేష్‌ కృతజ్ఞతుల తెలియజేశాడు.మొత్తానికి లక్‌ అంటే రాజేష్‌దే కదా.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube