తెలుగుదేశం పార్టీ అంటే పీకల్లోతు కోపం పెంచుకున్న బీజేపీ అగ్ర నాయకత్వం ఏపీ లో ఆ పార్టీకి మనుగడ లేకుండా చేయాలని చూస్తోంది.దీనిలో భాగంగానే ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ పధకానికి తెరతీయాలని చూస్తోంది.
ఇప్పటికే టీడీపీకి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యులు,ఓ ఐదుగురు ఎమ్యెల్యేలతో మంతనాలు సాగించిన బీజేపీ త్వరలోనే వారందరిని పార్టీలో చేర్చుకుని టీడీపీకి గట్టి షాక్ ఇవ్వాలని చూస్తోంది.రాజ్యసభలో బీజేపీకి కావాల్సిన మెజార్టీ లేకపోవడంతో.
బిల్లులు ఆమోదం పొందలేకపోతున్నారు.ఈ క్రమంలో అనేక పార్టీల నుంచి రాజ్యసభ ఎంపీలను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ కోవాలనే పలువురితో సంప్రదింపులు చేసినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కీకాలంగా ఉంది బాబు కోటరీ నాయకులుగా పేరు పొందిన సుజనా చౌదరి, సీఎం రమేష్ లతో మంతనాలు చేసినట్టు సమాచారం.వీరిద్దరూ వరుసగా రెండు సార్లు రాజ్యసభ సభ్యత్వాలు దక్కాయి.సుజనా చౌదరిని అయితే కేంద్రమంత్రిని కూడా చేశారు.
ఇప్పుడు టీడీపీ ఓటమి చెందడం, ఇప్పటికే సుజనాపై జరిగిన ఐటీ, ఈడీ దాడులు అలాగే సీఎం రమేష్ పరిస్థితి కూడా ఇదే పరిస్థితి కావడంతో ఇప్పుడు వీరిద్దరూ తమ వ్యాపారాల కోసం బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నారట.ఇప్పటికే రామ్‌మాధవ్‌తో చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది.

వీరిద్దరే కాకుండా టీడీపీకి తెలంగాణ నుంచి గరికపాటి మోహన్ రావు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.టీజీ వెంకటేష్, తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్ వీరి బాటలోనే ఉన్నారట.వీరిలో.సుజనా చౌదరి, సీఎం రమేష్ పారిశ్రామిక కోటా నుంచి ఎంపికయ్యారు.టీజీ వెంకటేష్ కూడా అదే కోటాలో బాబు ఎంపిక చేశారు.అయితే ఆయన బీజేపీలో చేరుతారా.
లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.ఆయనకు చాలా పారిశ్రామిక సంస్థలు ఉండడంతో బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది.
రాజ్యసభ సభ్యులు మొత్తం ఒకేసారి బీజేపీలో చేరగానే ఆ తరువాత ఏపీలో ఎమ్యెల్యేలను చేర్చుకునే విషయంలో స్పీడ్ పెంచాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఏది ఏమైనా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు టీడీపీకి బాగా ఇబ్బందికరంగా తయారయ్యినట్టుగానే కనిపిస్తోంది.








