కేవలం పదివేల కోసం దారుణానికి పాల్పడ్డ దుర్మార్గులు

కేవలం పదివేల రూపాయల కోసం దారుణానికి పాల్పడ్డారు దుర్మార్గులు.కేవలం 10 వేల కోసం అత్యంత కిరాతకంగా,దారుణంగా రెండేళ్ల చిన్నారి ని పొట్టన పెట్టుకున్నారు.

 2 Years Girl Brutally Murdered-TeluguStop.com

యూపీలోని అలీగఢ్ లో చోటుచేసుకుంది.రెండేళ్ల చిన్నారి కళ్ళు పీకి, ఆమె గొంతు నులిమి హత్య చేసిన దుండగులు ఆ చిన్నారి మృత దేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు.

గత మే నెల 30 నుంచి మిస్సయిన ఆ చిన్నారి చివరికి శవమై తేలింది.ముక్కలు, ముక్కలైన ఈ బాలిక డెడ్ బాడీని కుక్కలు చెత్తకుండీ వద్ద లాగుతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు.

అసలు వివరాల్లోకి వెళ్తే.బాలిక తాత నుంచి జహీద్ అనే వ్యక్తి రూ.50 వేల అప్పు తీసుకున్నాడు.అయితే అందులో నలభై వేలు తీర్చేయగా, ఇంకా రూ.10 వేలు బాకీ పడ్డాడు.

కేవలం పదివేల కోసం దారుణానికి

అయితే ఈ బాకీ తీర్చాలంటూ చిన్నారి కుటుంబ సభ్యులనుంచి ఒత్తిడి పెరగడంతో.ఆగ్రహించిన జహీద్… అస్లం అనే వ్యక్తి సాయాన్ని కోరి, గత నెల 30 న ఆ బాలికను కిడ్నాప్ చేసినట్లు పోలీసుల దర్యాప్తు లో తేలింది.మూడు రోజుల తరువాత చెత్త ఏరివేస్తున్న ఓ మహిళకు బట్టలో చుట్టి ఉన్న చిన్నారి మృతదేహం చూసి కేకలు పెట్టిందట.

అప్పటికే ఆ బాలిక డెడ్ బాడీ గుర్తు పట్టలేకపోయినంతగా మారిపోయింది.ఈ ఘాతుకానికి సంబంధించి ఆమె పేరును వాడుతూఓ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది.

సెలబ్రిటీలతో సహా అనేకమంది ఈ ఘటనను ఖండిస్తూ .దుండగులను ఉరి తీయాలంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube