జగన్ నెక్స్ట్ టార్గెట్ టీడీపీ లో అవినీతి భాగోతాలే

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో తన పంథా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతున్నారు.ఏపీలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అనుమతి ఇవ్వడంతో పాటు, ఐఏఎస్, ఐపీఎస్ లను ఉన్నపళంగా భారీ ఎత్తున బదిలీ చేయడంతో తన నెక్స్ట్ టార్గెట్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలపై ఉండబోతుందని సంకేతాలు ఇస్తున్నాడు.

 Cm Jagan Next Target Tdp Government Scams-TeluguStop.com

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని భూముల నుంచి, వైజాగ్ ల్యాండ్ స్కాం, అలాగే ఐటీలో గోల్ మాల్ వంటివి జరిగినట్లు మీడియాలో కూడా వచ్చాయి.

ఈ నేపధ్యంలలో ఇప్పుడు అర్జెంట్ గా క్యాబినెట్ ఏర్పాటు చేసి తర్వాత అవినీతి భాగోతాలపై ద్రుష్టి పెడతాడని తెలుస్తుంది.

ఇప్పటికే చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి జగన్ తాను గత ప్రభుత్వంలో జరిగిన అన్ని పనులపైన విచారణ జరిపిస్తా అని, అలాగే అవినీతి భాగోతాలని ఆధారాలతో సహా బయటకి తీసి బాధ్యులైన వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసారు.ఈ నేపధ్యం అవసరం అయితే టీడీపీ హయాంలో జరిగిన పనులపై సిబిఐ విచారణ వేయడానికి కూడా సిద్ధమై ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక జగన్ టార్గెట్ ఇప్పుడు తమ మీదనే ఉందని గ్రహించిన టీడీపీ నేతలు కూడా మెల్లగా పార్టీ నుంచి జారుకుంటూ జగన్ ని సన్నిహితం కావడం లేదంటే కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ సపోర్ట్ తీసుకోవడం జరుగుతుందని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube