తెలుగు ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటే అందరికి వెంటనే గుర్తుకొచ్చే పేరు విజయశాంతి.హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో జత కట్టిన విజయశాంతి తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు ద్రుష్టి పెట్టి యాక్షన్ హీరోయిన్ గా మారిపోయింది.
ఇక హీరోయిన్ గా ఆమెకి వచ్చిన పేరు కంటే యాక్షన్ హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ గా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మరింత ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.ఇక తెలుగులో చివరిగా వైజయంతి అనే సినిమాలో నటించి తరువాత సినిమాలు వదిలేసి రాజకీయాలలో బిజీ అయిపొయింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో కీలక నేతగా ఉన్న విజయశాంతి మళ్ళీ చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలలో తెరకెక్కనున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో రీ ఎంట్రీ ఇస్తుంది.ఇక తాజాగా ఆమె పత్రిక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ద్రువీకరించింది.
తాను సూపర్ స్టార్ కృష్ణ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయ్యా అని, మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నా అని విజయశాంతి చెప్పుకొచ్చింది.ఇక ఈ సినిమా కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంటూ రాములమ్మ చెప్పుకొచ్చింది.
మరి మహేష్, రాములమ్మ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా టాలీవుడ్ లలో మరింత అంచనాలు పెంచడం గారంటీ అనే మాట ఇప్పుడు చిత్రసీమలో వినిపిస్తుంది.







