ఈ సృష్టిలో కన్న ప్రేమను మించింది మరేది ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఏదో కారణం వల్ల కన్న వారితో లేదా కన్న పిల్లలతో గొడవలు అయితే ఉండవచ్చు.
కాని మనసులో మాత్రం వారిపై ప్రేమ లేకుండా ఉండదు, తగ్గదు.ఈ విషయం మనం ప్రతి రోజు మన చుట్టు ఉన్న వారిలోనే చూస్తూ ఉంటాం.
అయితే ఇంకా పుట్టక ముందే గర్బస్థ శిషువుపై ప్రేమను పెంచుకున్న ఒక జంట ఆ శిషువు మరణంతో ఎంతటి ఆవేదనకు గురి అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ సంఘటన యూఎస్‌లోని మిస్కోరిలో జరిగింది.
స్థానిక షరన్ మరియు మైకేల్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా కొన్ని వారాల క్రితం వైధ్యులు నిర్ధారించారు.వీరు సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేశారు.
దాదాపు 20 ఏళ్లుగా సంతాకం కోసం పలువురు వైధ్యులను సంప్రదించారు.ఎట్టకేలకు తల్లిదండ్రులు కాబోతుండటంతో మైకేల్ మరియు షరన్‌ల ఆనందంకు అవదులు లేవు.
షరన్ గర్బస్థ శిషువు 14 వారాల వయసు అంటే దాదాపుగా నాలుగు నెలల వయసు ఉన్న సమయంలో గుండె కొట్టుకోవడం లేదని వైధ్యులు వెళ్లడించారు.గుండె కొట్టుకోకుండా పిండం ఉండటంతో చనిపోయినట్లుగా నిర్ధారించారు.
అబార్షన్ చేయాలని వైధ్యులు చెప్పారు.

మామూలుగా అబార్షన్ అంటే పిండంను కడుపులోనే ముక్కులు ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత బయటకు తీస్తారు.కాని అలా చేయడం మైకేల్ దంపతులకు ఇష్టం లేదు.చనిపోయినా కూడా ఆ పిండంను అలా తీయడం ఇష్టం లేని ఆ దంపతులు సిజేరియన్‌కు సిద్దం అయ్యారు.
షరన్ సిజేరియన్ చేయించుకుని మరీ ఆ పిండంను తీయించుకుంది.నాలుగు నెలల పిండం అవ్వడంతో కాళ్లు చేతులు ఏర్పడ్డాయి.ఆ పిండంను చూసి కన్నీరు మున్నీరు అయిన ఆ దంపతులు దాదాపు పది రోజుల పాటు ప్రీజర్‌లో భద్రపర్చి ఉంచుకున్నారు.
స్థానికులు మరియు ఇతరులు వారి పద్దతిపై విమర్శలు చేయడంతో చేసేది లేక ఖననం చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే బయట ఎక్కడో కాకుండా ఇంట్లోనే ఆ పిండంను ఖననం చేయాలని నిర్ణయించుకున్నారు.ఒక పూల కుండీ తీసుకు వచ్చి, దాంతో పిండంను ఖననుం చేసి ఆ తర్వాత ఒక చెట్టును నాటడం జరిగింది.
చెట్టును చూస్తూ తమ బిడ్డను గుర్తు చేసుకుంటామని వారు అంటున్నారు.ఖనంకు ముందు ఆ పిండం కాళ్లు చేతులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.ఆ తల్లిదండ్రుల కన్నీటి గాధ గురించి అంతటి చర్చించుకుంటున్నారు.







