ఇక ఆపు చాలు... ఇంకా వెనకేసుకు వస్తున్న దర్శకుడు

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీత’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా కాజల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

 Director Teja Talks About His Idea Of A Contemporary Sita Movie-TeluguStop.com

ముఖ్యంగా సినిమా విడుదల సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ గురించి, కాజల్‌ గురించి మాట్లాడుతూ తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కెరీర్‌ బెస్ట్‌ అంటూ ఈ చిత్రం గురించి తేజ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా వంద శాతం బాగుందని చెప్పుకొచ్చాడు.

ప్రీ రిలీజ్‌ వేడుకలో మాట్లాడుతూ సీత సినిమా వంద శాతం బాగా చేశాము.

అయితే సినిమా కొన్ని సీన్స్‌ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మళ్లీ షూటింగ్‌ చేశాం.సినిమాలో మొత్తం కూడా మంచి సీన్స్‌ ఉన్నాయని, సినిమా ఒకవేళ మీకు నచ్చకుంటే నన్ను తిట్టినా భరిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

తేజ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అని సీత విడుదలైన తర్వాత తేలిపోయింది.ఆయన మాటలతో కోటలు కట్టాడు.తీరా సినిమా విడుదలైన తర్వాత ఆయన మాటలు నీటి మూటలు అని తేలిపోయింది.

ఇక ఆపు చాలు ఇంకా వెనకేసుకు వస

సినిమా ఆకట్టుకోలేక పోతుంది.ఇప్పటికే సినిమాకు నెగటివ్‌ టాక్‌ వస్తున్న నేపథ్యంలో థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి.అయినా కూడా తేజ ఇంకా మాట్లాడుతూ తాను సీతను బాగా తీశాను, ప్రేక్షకులు బాగా ఆధరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.

సినిమా విడుదలై ఫలితం తేలిపోయిన తర్వాత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆయన్ను కొందరు విమర్శిస్తున్నారు.సీతను ఇంకా వెనుకేసుకు వచ్చేది చాలు, ఇక ఆపు అంటూ సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube