తెలుగు సినిమా స్టైల్ మార్చి హీరోయిజం, కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కి నచ్చే సినిమా ఎలా తీయాలో తెలిసిన దర్శకుల జాబితాలో రాఘవేంద్రరావు మొదటి స్థానంలో ఉంటారు.కమర్షియల్ చిత్రాల దర్శకుడుగా టాలీవుడ్ లో వందకి పైగా సినిమా తీసిన దర్శకేంద్రుడు.
మాటల్లో కంటే చేతల్లోనే తన సత్తా చూపిస్తూ ఉంటారు.భక్తి రస చిత్రాలలో కూడా కమర్షియల్ కోణాన్ని ఆవిష్కరించే దర్శకుడుగా అతని గురించి అందరూ చెప్పుకుంటున్నారు.
చివరిగా నమో వెంకటేశాయా సినిమా తో ప్రేక్షకుల ముందుకి రాఘవేంద్రరావు వచ్చారు.
అయితే మళ్ళీ ఒకప్పటి రాఘవేంద్రుడు స్టైల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీని ఆయన తీస్తే చూడాలని, పాటలని దృశ్యకావ్యంగా వర్ణించే అతని పాటలు చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అలా ఎదురుచూసే వారిలో ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఉన్నారు.ఈ నేపధ్యంలో తాజాగా రాఘవేంద్రరావుతో మళ్ళీ దర్శకత్వం చేయాలనీ, ఇందుకోసం ఇప్పటి ట్రెండ్ కి తగట్టు మంచి కమర్షియల్ కథను వెతుకుతున్నారట.
ఇదిలా ఉండగా రాఘవేంద్రరావుకి రచయిత బి.వి.యస్.రవి ఒక మంచి కమర్షియల్ కథను వినిపించారని సమాచారం.పెళ్ళిసందడి స్టైల్లో ఎంటర్టైనర్ కథనంతో నడిచే కథ రాఘవేంద్రరావుకి బాగా నచ్చినట్లు తెలుస్తోంది.పూర్తిస్థాయి నూతన నటినటులతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేయబోతుననట్లు తెలుస్తోంది.







