పరుగుల రాణి పీటీ ఉష పేరు తెలియని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.పరుగులు రాణిగా భారతీయ కీర్తి కిరీటం ని ప్రపంచం వ్యాప్తంగా వినిపించేలా చేసిన ఈమె జీవితం పూలపాన్పు కాదు.
నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలో పరుగుని జీవిత ఆశయంగా ఎంచుకొని ఒలింపిక్, ప్రపచ పోటీలలో పాల్గొని సత్తా చాటింది.ఆమె జీవిత ఎంతో మందికి ఆదర్శం అని పాఠ్య పుస్తకాలలో కూడా చేర్చడం జరిగింది.
ఇప్పుడు పరుగులు రాణిగా పీటీ ఉష జీవితంపై ద్రుష్టి సారించారు.ఇప్పటికే ఈ బయోపిక్ కోసం హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాలో కత్రినా లీడ్ రోల్ పోషించనున్నట్లు బీ- టౌన్ టాక్.తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాలకు దర్శకత్వం వహించిన రేవతి ఎస్.
వర్మ ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు సమాచారం
.






