ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ యాప్ మార్కెట్ లోకి వస్తే దానిని డౌన్ లోడ్ చేసుకొని వాడటంలో ఇండియా ప్రజలు ముందుంటారు.ఎ విషయంలో ఆలస్యంగా ఉన్న మనవాళ్ళు ఇల్లా స్మార్ట్ ఫోన్ లో వచ్చే యాప్స్ ని వాడటంలో మాత్రం మొదటి ప్లేస్ లో ఉంటారనే చెప్పాలి.
ఈ కారణంగాగా చైనాకి చెందిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ మార్కెట్ లోకి రిలీజ్ అయిన తక్కువ టైంలో ఇండియా మొత్తం వ్యాపించేసింది.అయితే దీని వలన అశ్లీలత ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అనే కారణాలతో ఇండియాలో ఆ యాప్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ బ్యాన్ తో ప్లే స్టోర్, ఐ ఫోన్ కూడా ఈ యాప్ ని తొలగించాయి.
టిక్-టాక్ పై భారత్ లో నిషేధం కారణంగా భారీగా నష్టపోతుంది అని తెలుస్తుంది.ఈ నష్టం రోజుకు 5లక్షల డాలర్లు ఉందని అంటే సుమారు 3.5కోట్లు కంపెనీ నష్టం అని సమాచారం.ఇక ఇండియాలో నిషేధం కారణంగా యాప్ లో 250మంది ఉద్యోగాలపై ఉద్వాసన కత్తి వేలాడుతోంది.ఈ యాప్‌ను 1 బిలియన్‌కు పైగా వినియోగిస్తుండగా, భారత్‌లో ఏకంగా 300మిలియన్ల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారని తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది.







