తాజాగా జరిగిన ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలకి కంటి మీద కునుకు లేకుండా చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత కొంత విరామం తీసుకొని తాజాగా మళ్ళీ మీడియా ముందుకి వచ్చాడు.ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధులతో సమీక్ష సమావేశం నిర్వహించడం ద్వారా భవిష్యత్తు ప్రణాళికపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు.
ఇక ఈ సమీక్షా సమావేశంలో పవన్ వాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి పెంచాయి అని చెప్పాలి.బలమైన మార్పు రావాలన్న ఉద్దేశంతోనే తాను పోరాటాన్ని మొదలుపెట్టానని ఆ మార్పు చిన్నగా మొదలవుతుందని జనసేనాని అన్నారు.
ఎన్నికలు పూర్తయ్యాక మాకు 120 వస్తాయని వైసీపీ, మాకు ఇన్ని వస్తాయని టీడీపీ లెక్కలు వేశాయి.జనసేనాని అలా లెక్కలు వేసుకోదు.
ప్రజాభిప్రాయం ఏదైనా గౌరవించడానికి సిద్ధంగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.ఓటింగ్ సరళి గురించి తెలుసుకోమని మాత్రమే తాను నాయకులకు చెప్పానన్నారు.ఇకపై గ్రామాల నుంచి నాయకులను తయారుచేసే పనిలో ఉండాలని నేతలకు సూచించారు.ఎన్నికలు ఉన్నా, లేకపోయినా కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉండాలన్నారు.
ప్రతి చోటా రెండు కుటుంబాలే ఆపరేట్ చేస్తున్నాయని, దీన్ని మార్చాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.ఇక పవన్ మాటల బట్టి ఈ ఎన్నికలలో తమ పార్టీ పూర్త స్థాయిలో ప్రజలని ప్రభావితం చేయలేకపోయింది అని, అయితే బలమైన మార్పుకి పునాది వేయడం ద్వారా రాష్ట్రంలో కింగ్ మేకర్ పాత్ర తీసుకోవడంతో భవిష్యత్తు రాజకీయాలని శాశించే శక్తిగా జనసేన మారుతుందనే విశ్వాసం వ్యక్తం చేసినట్లు అయ్యింది.
.






