మా ఎన్నికల్లో తన ఓటమికి ప్రధాన కారణం నాగబాబు అంటూ మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా అన్నాడు.చివరి నిమిషంలో నరేష్ ప్యానెల్‌కు మద్దతు ఇవ్వడం వల్ల నేను ఓడిపోయాను అంటూ నాగబాబుపై చాలా ఆగ్రహంతో శివాజీ రాజా ఉన్నాడు.
ఆ కోపంతో నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు.అయితే నాగబాబు ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు.600 మంది మా మెంబర్స్‌కు న్యాయం చేయలేని వ్యక్తి లక్షలాది మంది ఉండే ఎంపీ స్థానంలో పోటీ చేసి గెలిస్తే ఏం చేస్తాడంటూ ప్రశ్నించాడు.
నాగబాబును ఇంకా దారుణంగా దూషించాడు.
దాంతో మెగా ఫ్యాన్స్ శివాజీ రాజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.ఈ సమయంలోనే నాగబాబు స్పందించాడు.
శివాజీ రాజా తనపై చేసిన ఆరోపణలకు సున్నితంగా సమాధానం ఇచ్చాడు.శివాజీ రాజా తనకు ఆప్తుడు, అతడికి మద్దతు ఇవ్వలేదని తనను ఇన్నేసి మాటలు అనడం ఆశ్చర్యంగా ఉంది.
ఒకసారి మా అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి మళ్లీ ఎందుకు అనే ఉద్దేశ్యంతోనే నేను నరేష్ ప్యానల్‌కు మద్దతు ఇచ్చాను.ఆ విషయంను అర్థం చేసుకోకుండా నేను ఏదో అన్యాయం చేసినట్లుగా శివాజీ రాజా అన్నాడు.

నాపై కోపంతో వైకాపాలోకి వెళ్లి నన్ను ఇష్టం వచ్చినట్లుగా విమర్శించడం నాకు బాధగా అనిపించింది.అతడి విజ్ఞతకే ఆ విషయాన్ని వదిలేస్తున్నాను.నేను అతడిని నరేష్ కంటే ఎక్కువ అనుకున్నాను.నరేష్ సీనియర్ హీరో, మంచి నటుడు అనే ఉద్దేశ్యంతో ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆయనకు మద్దతు ఇచ్చాను.
అంతే తప్ప మరేం లేదు.కాని శివాజీ రాజా మాత్రం మరో రకంగా ఆలోచించాడని నాగబాబు అన్నాడు.
తాను మద్దతు ఇచ్చి గెలిపించిన జీవిత రాజశేఖర్‌లు కూడా వైకాపాలోకి వెళ్లి తనను విమర్శిండంపై నాగబాబు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదే సమయంలో నాగబాబు జబర్దస్త్ గురించి స్పందిస్తూ.
నెలలో నాలుగు అయిదు రోజులు ఆ కార్యక్రమం కోసం కేటాయిస్తే సరిపోతుంది.నేను గెలిచినా, ఓడినా కూడా నేను జబర్దస్త్ కు జడ్జ్‌గా ఉంటానంటూ పేర్కొన్నాడు.







