ఏపీ ఎన్నికల ప్రచార జోరు ఈ రోజుతో ముగియనుంది.ఇక ప్రజలు కూడా ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలో అనే విషయంపై ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చేసారు.
మరో వైపు ఓటర్స్ ని ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు కోట్ల రూపాయిలు నల్లదనం ఖర్చు పెట్టడానికి రెడీ అయిపొయింది.అన్ని పార్టీల ప్రధాన నేతలు తమకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకొని ప్రధాన పార్టీలు రెండు ఎన్నికలలో కుట్రలకి తెరతీసాయి.
ఇక పవన్ కళ్యాణ్ కూడా ఊహించని విధంగా వైసీపీ మీద ఈ ఎన్నికలలో ఎదురుదాడి చేసాడు.
తనకి అత్యంత సన్నిహితంగా ఉండేవారు వైసీపీ పార్టీలో చేరి తనపై విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడంతో పవన్ కళ్యాణ్ కూడా వారిపై ఎదురుదాడి చేసాడు.ఇక తాజాగా పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు అయిన అలీ వైసీపీలో చేరడపై పవన్ రాజమండ్రి సభలో నేరుగా విమర్శించారు.
తనకి అత్యంత సన్నిహితుడు అయిన అలీకి తాను ఎప్పుడు గొప్ప స్థానం ఇచ్చానని అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీకి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాఖ్యలపై అలీ కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.రాజమండ్రి ప్రచారంలో పవన్ కళ్యాణ్ అన్న మాటలు తనని బాధించాయని, పవన్ కళ్యాణ్ కంటే ముందుగానే తాను ఇండస్ట్రీలో పెద్ద స్థానంలో ఉన్నానని, తను పవన్ చేసింది ఏమీ లేదని, తాను కష్టంలో ఉన్నప్పుడు పవన్ తనకి సాయం చేసానని చెప్పారని ఎలా చేసారో చెప్పాలని కోరారు.వైసీపీ పార్టీకి ప్రచారం చేస్తున్న తాను ఎక్కడ జనసేన మీద విమర్శలు చేయలేదని, అయితే ఇప్పుడు తనపై పవన్ తన సొంత ఊరు రాజమండ్రిలో అలా విమర్శలు చేయడం బాధకలిగించింది అంటూ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు వీళ్ళిద్దరి గొడవ ద్వారా అలీ, పవన్ కళ్యాణ్ బంధానికి బీటలు వారినట్లే అని అందరూ అనుకుంటున్నారు.







