అతడు ఎఫ్‌బిలో పోస్ట్‌ చేశాడు... ఆ తర్వాత అతడి ఇంటికి ఫేస్‌బుక్‌ ఆఫీస్‌ నుండి ప్రతినిధులు వెళ్లారు

ఒకప్పుడు ఫేస్‌ బుక్‌లో ఎలాంటి పోస్ట్‌ పెట్టినా, ఎలాంటి కామెంట్‌ చేసినా పెద్దగా పట్టింపులు ఉండేవి కాదు.

కాని ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవ్వడంతో పాటు, అనేక కారణాల వల్ల ఫేస్‌బుక్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.

డేటా థ్రెఫ్టింగ్‌ ద్వారా పరువు పోగొట్టుకున్న ఫేస్‌బుక్‌ మరోసారి అలా జరగకూడదని భావిస్తుంది.అందుకే ప్రతి పోస్ట్‌ను కూడా క్షుణంగా చూస్తుంది.

ఏదైనా పోస్ట్‌ తేడాగా అనిపిస్తే వెంటనే దాన్ని తొలగించం మరియు వారి అకౌంట్‌పై చర్యలు తీసుకోవడం చేస్తుంది.ఫేస్‌బుక్‌లో తాజాగా ఒక పోస్ట్‌ పెట్టిన వ్యక్తికి వింత అనుభవం ఏర్పడింది.

ఢిల్లీలోని వ్యక్తి తాజాగా ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ చేశాడు.ఆ పోస్ట్‌ అతడి జీవితానికి సంబంధించిందట.

Advertisement

అయితే ఆ పోస్ట్‌ పెట్టిన వ్యక్తి నిజమైన వ్యక్తేనా, అసలు అది నిజమేనా అని తెలుసుకునేందుకు ఏకంగా ఫేస్‌బుక్‌ ఢిల్లీ ఆఫీస్‌ నుండి ఇద్దరు ముగ్గురు ప్రతినిధులు ఢిల్లీలోని ఆ యూజర్‌ ఇంటికి చేరుకున్నారు.ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లి ఫేస్‌బుక్‌ ఫ్రొపైలో ఉన్న ఫొటో మరియు ఇతరత్ర వివరాలను సరి చూసుకున్నారు.

పేరు విషయంలో ఆధార్‌ కార్డును చెక్‌ చేశారు.అన్ని బాగానే ఉండటంతో ఏదో ఫార్మాల్టీకి వచ్చి చెక్‌ చేశాం అంటూ చెప్పుకొచ్చారు.

ఫేస్‌బుక్‌ ప్రతినిధులు వచ్చి చెక్‌ చేసేంతగా అతడు ఏం పోస్ట్‌ చేశాడా అంటూ చర్చ మొదలైంది.ఎందుకు ఫేస్‌బుక్‌ ప్రతినిధులు వచ్చారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వని ఆ యూజర్‌ తనకు జరిగిన అవమానంకు కోర్టుకు వెళ్తాను అంటూ ప్రకటించాడు.ఇంటికి వచ్చి నా వివరాలను తెలుసుకోవడం అనేది నా పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన విషయాల్లో తొంగి చూడటమే అంటూ అతడి తరపు లాయర్‌ ఆరోపిస్తున్నాడు.

ఈ విషయమై ఫేస్‌బుక్‌కు మరోసారి న్యాయ స్థానం నుండి చివాట్లు అక్షింతలు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసేందుకు అందుకే కాస్త జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం చాలా ఉందని చెప్పదల్చుకున్నాం.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు