రాక్ స్టార్ ప్రాణాలు తీసిన మీటూ ఆరోపణలు! ప్రపంచ వ్యాప్తంగా సంచలనం

సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై ప్రపంచ వ్యాప్తంగా మహిళ సెలబ్రిటీలు మీటూ కాంపైన్ స్టార్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.

ఈ మీటూ కాంపైన్ ద్వారా చాలా మంది నటీ మణులు మీడియా ముందుకి వచ్చి తమకి గతంలో జరిగిన అనుభవాలు, లైంగిక వేధింపుల మీద నోరు విప్పారు.

అలాగే తమని లైంగికంగా వేధించిన వారి గురించి కూడా ప్రపంచానికి పరిచయం చేసారు.ఇక ఇండియాలో బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్స్ మీద లైంగిక వేదింపులకి సంబంధించి మీటూ కాంపైన్ జోరుగా సాగింది.

అయితే మీటూ కాంపైన్ మాటున కొంత మంది హీరోయిన్స్ కావాలని నటులని, సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ప్రబ్లిసిటీ పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపించాయి.హీరోయిన్స్, నటీమణుల లైంగిక ఆరోపణలపై న్యాయస్థానంని ఆశ్రయించి వారి మీద పరువు నష్టం దావా వేసిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మీటూ ఆరోపణల కారణంగా అవమాన భారంతో ఇప్పుడు ఓ పాప్ సింగర్, రాక స్టార్ ఏకంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Advertisement

మీటూ ఆరోపణలతో మనస్తాపం చెందిన మెక్సికన్ రాక్‌స్టార్ ఆర్మాండో వెగా గిల్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు.తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని సూసైడ్ నోట్ లో రాసి ఆత్మహత్య చేసుకున్నారు.గిల్ 13 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఉన్నాయి.

దీంతో కొద్దికాలంగా బాహ్య ప్రపంచానికి ఆయన దూరంగా ఉంటున్నాడు.అయితే అనూహ్యంగా సోమవారం ఆత్మహత్య చేసుకోవడం మ్యూజిక్ ప్రపంచంలో సంచలనం రేపింది.

ఈ అవాస్తవ ఆరోపణల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై గిల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు