బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన ‘సీత’ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది.తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పూత్ ఒక ఐటెం సాంగ్‌ను చేసింది.
ఆ ఐటెం సాంగ్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పాయల్ హాట్ అందాలతో పాటు అనూప్ రూబెన్స్ కొట్టిన మాస్ బీట్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
తప్పకుండా సినిమాకు ఈ పాట హైలైట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు.అయితే పాటలోని కొన్ని పదాలు ప్రస్తుతం వివాదాన్ని రేపుతున్నాయి.
సీత సాంగ్‌లో రెడ్లను అవమానపర్చే విధంగా ఉన్నాయి అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పాటలో రెడ్డి పేరుతో పల్లవి ఉందని, అది అవమాన పర్చే విధంగా ఉందని, రెడ్డి కులస్తులను తప్పుగా అర్థం చేసుకునేలా ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.తేజకు కొందరు నేరుగానే వార్నింగ్ ఇస్తున్నారు.పాటలోని ఆ పదాలను తొలగించాలని, లేదంటే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు.
రెడ్లను ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వినియోగించుకోవడమేనా, రెడ్ల కులస్తులు సినిమాలో ఎలా చూపించినా కూడా సైలెంట్‌గా కూర్చోవాలా అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

పాటలో రెడ్డి అనే పదం పలు సార్లు వాడినందుకు గాను క్షమాపణలు చెప్పి, పాట నుండి రెడ్డి పదం తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.దాంతో చిత్ర యూనిట్ సభ్యులు ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది.రెండు మూడు రోజులు చూసిన తర్వాత తేజ స్పందించే అవకాశం ఉంది.ఇది సీరియస్‌గా రెడ్డి కులస్తులు తీసుకుంటారా లేదంటే కొందరు కింది స్థాయి వారు పబ్లిసిటీ చేస్తున్నారా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది.‘సీత’ చిత్రంకు ఐటెం సాంగ్ హైలైట్ అవుతుందని భావిస్తున్న సమయంలో సినిమాకు ఆ పాట ఇలా ప్రచారం చేయడం కూడా యూనిట్ సభ్యులకు ఆనందాన్ని కలిగిస్తుంది.







