సర్జికల్ స్ట్రైక్ హీరోకి డేటింగ్ ఆఫర్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ

పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్ నేపధ్యంలో బాలీవుడ్ లో యూరి మూవీ తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ఓ కీలక పాత్రలో కనిపించాడు.

 Heroine Tamannaah Giver Dating Offer To Uri Hero-TeluguStop.com

ఇక యూరి సినిమాలో అతని నటనకి బాలీవుడ్ ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.దీంతో ఒక్కసారిగా వచ్చిన క్రేజ్ తో ఈ యువ హీరో బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్నాడు.

నటనతో తనదైన ముద్ర వేస్తున్న విక్కీ కౌశల్ కి అమ్మాయిలు కూడా ఫ్లాట్ అయిపోతున్నారు.

తాజాగా విక్కీ కౌశల్ నటనకి తాను ఎంతగా ఫ్యాన్ అయిపోయానో అనే విషయాన్ని సౌత్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చెప్పుకొచ్చింది.యూరి సినిమాలో అతని నటన చూసి ఫిదా అయిపోయా అని అవకాశం వస్తే వెంటనే అతనితో డేటింగ్ కి వెళ్ళాలని ఉంది అంటూ హాట్ కామెంట్స్ కూడా చేసింది.దీంతో ఇప్పుడు తమన్నా బోల్డ్ కామెంట్స్ బాలీవుడ్ లో సంచలనంగా మారాయి.

ఇప్పటికే తన అభిమాన హీరో హృతిక్ రోషన్ కి ముద్దు పెట్టాల్సి వస్తే కచ్చితంగా ఆ అవకాశం వదులుకోనని, చెప్పుకొచ్చింది.ఇప్పుడు విక్కీ కౌశల్ మీద తమన్నా తన ప్రేమని చాటుకుంది.

మరి తమన్నా ఆఫర్ ని విక్కీ ఎంత వరకు అంగీకరిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube