గోవా సిఎంగా ప్రమోద్ సావంత్! ఈ రాత్రికి ప్రమాణ స్వీకారం

బీజేపీ సీనియర్ నాయకులు, గోవా సిఎం మనోహర్ పారికర్ మరణించిన సంగతి అందరికి తెలిసిందే.ఈ నేపధ్యంలో మనోహర్ పారికర్ అంత్యక్రియలు కూడా ఈ రోజు సాయంత్రం పూర్తయ్యాయి.

 Pramod Sawant To Be Goa Chief Minister-TeluguStop.com

ఇక అధికార పార్టీ బీజేపీ గోవాలో తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్ధిపై తీవ్ర కసరత్తు చేసాయి.చివరికి గోవా అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న ప్రమోద్ సావంత్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది.

మనోహర్ పారికర్ మరణంతో ఒక్కసారిగా గోవాలో రాజకీయాలు వేడెక్కాయి.కాంగ్రెస్ పార్టీ గవర్నర్ ని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకి అవకాశం ఇవ్వాలని కోరారు.అయితే బీజేపీకి మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్ధులు కూడా బీజేపీకే మద్దతు ప్రకటించడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకి సిద్ధం అయ్యింది.దీంతో హుటాహుటిన ప్రమోద్ సావంత్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిర్ణయించి, ఈ రాత్రికే ప్రమాణ స్వీకారం చేయించేందుకు సిద్ధం అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube