అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటిన టిఆర్ఎస్ పార్టీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే ఫలితాలను రిపీట్ చేయాలని చూస్తోంది, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు తొమ్మిది జిల్లాల్లో తిరుగులేని ఆధిపత్యం సాధించిన ఆ పార్టీ కి ఖమ్మం జిల్లాలో మాత్రం చేదు ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది.కేవలం ఒకే ఒక్క సీటు తో సరిపెట్టుకోవాల్సి రావడం ఆ పార్టీ కి మింగుడుపడడంలేదు.
అయితే ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసిన గులాబీ బాస్ ఖమ్మం జిల్లాలో నెలకొన్న గ్రూపు తగాదాలే పార్టీ కొంప ముంచాయనే అభిప్రాయానికి వచ్చాడు.అందుకే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ బలపడేలా వ్యూహరచన చేస్తున్నాడు.
ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేరేలా ఒప్పించడంతోపాటు గెలిచినా ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో అయినా కారు ఎక్కించాలని చూస్తున్నాడు.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటమి చెందడానికి ముఖ్య కారణం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని కెసిఆర్ కు అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ సారి ఆయనకు టికెట్ దక్కే అవకాశమే లేదని తెలుస్తోంది.
ఆయన స్థానంలో వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ కి టిక్కెట్ కేటాయించారనే ప్రచారం కూడా అ గులాబీ పార్టీలో మొదలైంది.కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోను మళ్లీ తానే టికెట్ దక్కించుకోవాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
కానీ పొంగులేటి మార్పు ఖాయమని ఆయనతోపాటు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కూడా టికెట్ దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది.

కెసిఆర్ అంతరంగికుడు సంతోష్ రావు బంధువైన నవీన్ రావుకు ఆ టికెట్ దక్కవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ని కూడా మార్చాలని కెసిఆర్ భావిస్తున్నాడట.వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా ఈసారి టికెట్ దక్కకపోవచ్చనేప్రచారం జరుగుతోంది.
ఆయన స్థానంలో కడియం శ్రీహరి లేదా ఆయన కుమార్తె కు టికెట్ దక్కే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం మొదలైంది.ఇక చేవెళ్ల ఎంపీ టికెట్ రంజిత్ రెడ్డి కి ఇవ్వబోతున్నట్టు ప్రచారం మొదలైనా కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రా రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరడం దాదాపు కావడంతో ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి ఈ స్థానాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది మొత్తంగా చూస్తే ఎంపీ అభ్యర్థులు సగం మందికి పైగా మార్చాలని కేసీఆర్ చూస్తున్నట్టు అర్ధం అవుతోంది.