జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు, కమెడియన్ అలీ రాజకీయాలలో వెళ్ళడానికి రెడీ అయిన సంగతి అందరికి తెలిసిందే.తన రాజకీయ ఎంట్రీతోనే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా కావాలని ఆశిస్తున్న అలీ తమ డిమాండ్ ని అన్ని పార్టీల వద్ద ఉంచాడు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి అలీకి ఆ రకమైన హామీ రాకపోవడంతో వైసీపీ, టీడీపీ పార్టీలలో ఒక దానిని ఎంచుకున్నాడు.అయితే గత కొద్ది రోజులుగా టీడీపీ తరుపున గుంటూరు నుంచి అలీ పోటీ చేస్తాడని వార్తలు వినిపించాయి.
అయితే ఊహించని విధంగా అలీ ఆదివారం వైసీపీ అధినేత జగన్ తో బేటీ కావడం తరువాత వైసీపీలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు.అదే టైంలో గుంటూరులో అలీ పోటీ చేస్తానన్న నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిని టీడీపీ ఇప్పటికే ఫైనల్ చేయడంతో ఇక వైసీపీలో అలీ చేరడం పక్కా అని సమాచారం బయటకి వచ్చింది.
దానికి తగ్గట్లుగానే అలీ వైసీపీలో ఈ రోజు చేరబోతున్నట్లు తెలుస్తుంది.ఇక గ్రాఫ్ పరంగా చూసుకున్న వైసీపీ పార్టీ రానున్న ఎన్నికలలో గెలిచే అవకాశం వుందని సర్వేలు చెబుతున్నాయి.
ఈ నేపధ్యంలో అలీ వైసీపీలో చేరిక ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.