కుక్కలు పదే పదే ఏడిస్తే సంకేతం ఏంటో తెలుసా...? మనుషుల చావు కుక్కలకు తెలుస్తుందా?

మనుషులకు ఉండే తెలివి, విచక్షణ, విలువలు ఇంకా భావోద్వేగాలు జంతువులకు ఉండవని అంతా భావిస్తారు.కాని కొన్ని జంతువులకు మనకంటే ఎక్కువ తెలివి ఉండటంతో పాటు, మనకంటే ఎక్కువగా భావోద్వేగానికి లోను అవ్వడం జరుగుతుంది.

 Superstitions About Howling Dogs-TeluguStop.com

మనుషులు జంతువులకు మద్య తేడా అవి మాట్లాడలేవు మనం మాట్లాడుతాం.అయితే జంతువులు కూడా మాట్లాడేందుకు, మనకు కూడా తెలియని విషయాలను తెలియజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాయి.

ముఖ్యంగా కుక్కలు మనిషి జీవితంతో మమేకం అయ్యి ఉంటాయి.మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సారుప్యత ఎక్కువగా ఉంటుంది.మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటున్నారు.కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయనే నమ్మకం అందరిలో ఉంది.అయితే దాన్ని మూడ నమ్మకంగా ఎక్కువమంది కొట్టి పారేస్తారు.

అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఒక యూనివర్శిటీ వారు కుక్కలపై అద్యాయనం చేసి వాటికి మనుషులు చూడలేని సంఘటనలు చూసే శక్తి ఉందని, అవి చాలా దీర్ఘ దృష్టితో చూస్తాయని వెళ్లడించారు.కుక్కలు పదే పదే ఏడుస్తున్నాయి అంటే వాటిని ఏదో వింత ఆకారం కనిపించి ఇబ్బంది పెడుతున్నట్లుగా శాస్త్రవేత్తలు అంటున్నారు.

అంటే అది దెయ్యమే అని అందరి నమ్మకం.

కుక్కలు పదే పదే ఏడుస్తున్న సమయంలో ఆ కుక్క రెండు చెవుల మద్య నుండి ముందుకు చూసినట్లయితే ఆ వింత ఆకారం మనకు కూడా కనిపిస్తుందని కొందరు అంటూ ఉంటారు.ఇక మనిషి మరణంకు చేరువ అయిన సమయంలో కూడా కుక్కలు మౌనంగా ఏడుస్తాయని, చనిపోయే వ్యక్తి వద్ద కుక్కలు ఉన్నట్లయితే అవి పదే పదే మొరగడం లేదా మూలుగుతూ ఏడవడం చేస్తాయంటున్నారు.మనిషి మరణం వాటికి కనిపిస్తుందని అందుకే అలా మొరుగుతాయని అంటూ ఉంటారు.

వీటికి శాస్త్రీయ ఆధారాలు అయితే లేవు కాని ఖచ్చితంగా వీటిని నమ్మాలని పెద్దలు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube