రామ్ గోపాల్ వర్మ భార్యా, కూతురు గురించి ఈ నిజాలు మీకు తెలుసా.? కూతురు పెళ్లి వేడుకలో ఏమైందంటే.?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దివంగత ఎన్టీఆర్ హాట్ సబ్జెక్ట్‌గా మారారు.ఇప్పటికే ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ .

 Unknown Facts About Ram Gopal Varma Wife And Daughter-TeluguStop.com

ఆయన జీవితాన్న రెండు భాగాలుగా కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో తెరకెక్కించాడు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలు అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

ఇక లక్ష్మీస్ ఎన్ఠీఆర్ తో ఇదే తరుణంలో రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్ సృష్టించనున్నాడు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది.

అసలు కథ ఏంటో తెలుసుకోవాలని తెలుగు అభిమానులు అందరు సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.చిత్ర బృందం మార్చి 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

ఇక ఇది ఇలా ఉండగా…రామ్ గోపాల్ వర్మ భార్యా, కూతురు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.అవేంటో ఓ లుక్ వేసుకోండి.చాలా మంది రాంగోపాల్ వర్మకు పెళ్లి కాలేదని అనుకుంటారు.కాని అది నిజం కాదు.

ఆయన భార్య పేరు రత్న… వారివురి దాంపత్యానికి గుర్తుగా రేవతి అనే కూతురు కూడా ఉంది.సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన రత్నది వర్మకి పూర్తి భిన్నమైన మనస్తత్వం.

రత్న భర్తనుండి విడిపోయినప్పటికీ రేవతిని పద్ధతిగా పెంచుకున్నారు.రష్యాలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన రేవతి పెళ్లి కూడా చేసుకుంది.

అయితే ఆ పెళ్లి వేడుకలో కూడా తల్లి కూతుర్లు వర్మని గెస్ట్ గానే ట్రీట్ చేశారు.వర్మ భార్య గురించి వార్తలు ఎప్పుడూ రాలేదు కానీ వర్మ కూతురు మాత్రం తండ్రినెప్పుడూ విభేదిస్తునే వస్తుంది.

ఆ మధ్య ఏదో ట్వీట్ విషయంలో కూడా తండ్రిని విభేదించి ఆ ట్వీట్ డిలీట్ చేస్తావా లేదా అని బహిరంగంగానే వెల్లడించింది.వర్మ ప్రవర్తన తెలిసిన ఎవరైనా భార్యభర్తలు ఎందుకు విడిపోయుంటారో అని పెద్దగా కారణాలు వెతుక్కోనక్కర్లేదు.సమాజంలో కొంచెం డిఫరెంట్ ఉండే వర్మకి కుటుంబవాతావరణం పెద్దగా సూట్ కాదని తనే చాలా సార్లు చెప్పాడు…అయితే భార్య గురించి వర్మ ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడలేదు .కానీ ఈ మధ్య ఓ సందర్భంలో వర్మ మాట్లాడుతూ తనకు మంచి భార్య దొరికింది కాని… తన భార్యకు మాత్రం మంచి భర్త దొరకలేదని వ్యాఖ్యానించాడు.ఈ ఒక్కమాటతోనే చెప్పొచ్చు ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పదో….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube