మెస్మరైజ్ చేసిన షేడ్స్ ఆఫ్ సాహో2! ఫ్యాన్స్ కి ఫుల్ బొనంజా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా భారీ యాక్షన్ థ్రిల్లర్ గా సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సాహో.ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Interesting Visual Treat Coming From Shadesofsaaho2-TeluguStop.com

ఇక ఇప్పటికే షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ వన్ మేకింగ్ వీడియోతో సినిమా మీద కావాల్సినంత హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు తాజాగా శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు.ఊహించినట్లుగానే ఈ వీడియో కూడా యాక్షన్ ఎలిమెంట్స్ తోనే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

పూర్తిగా గ్రీన్ మ్యాట్ స్టూడియోలో షూట్ చేసిన యాక్షన్ ఎలిమెంట్స్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా వున్నాయి.ప్రభాస్ విలన్స్ మధ్య జరిగే యాక్షన్ ని ఈ మేకింగ్ వీడియోలో ప్రెజెంట్ చేసారు.

అలాగే ఇందులో శ్రద్ధాకపూర్ ని కూడా చాలా పవర్ ఫుల్ గా పోలీస్ కాప్ గా హీరోయిక్ లుక్స్ తో రివీల్ చేయడం ద్వారా ఇందులో ఆమె క్యారెక్టర్ కూడా చాలా ఎనర్జిటిక్ గాఉండబోతుంది అని తెలుస్తుంది.అలాగే ఇంది కచ్చితంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో యాక్షన్ థ్రిల్లర్ గా యంగ్ రెబల్ స్టార్ కెరియర్ లో మరో బెస్ట్ సినిమాగా నిలిచిపోయి ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడం గారంటీ అనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube