మళ్ళీ తమన్ వైపే చూస్తున్న త్రివిక్రమ్! బన్ని కోసం కొత్త ట్యూన్స్!

అజ్ఞతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన సత్తా ఎ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు.దీంతో చాలా కాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్ మళ్ళీ తన లక్ ఫ్యాక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు.

 Trivikram Gives Chance To Thaman For Music-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.ఇది ఫాదర్, సన్ సెంటిమెంట్ తోనే త్రివిక్రమ్ తెరకెక్కించే పనిలో ఉన్నాడని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా వుంటే త్రివిక్రమ్ కెరియర్ లో ఎక్కువగా దేవిశ్రీప్రసాద్ తో సినిమాలు చేసాడు.అయితే అజ్ఞాతవాసి కోసం అతన్ని పక్కన పెట్టి అనిరుద్ ని తీసుకున్న ఆ సినిమా అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాకపోవడంతో అరవింద సమేత కోసం తమన్ కి అవకాశం ఇచ్చాడు.

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత ఆడియో సూపర్ కావడంతో మళ్ళీ త్రివిక్రమ్ బన్ని సినిమా కోసం తమన్ కి అవకాశం ఇచ్చాడు.ఇక తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చిత్ర యూనిట్ తో కలిసినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube