బీసీ గర్జనలో వైసీపీ అధినేత వరాల జల్లు! బీసీల కోసం సబ్ ప్లాన్!

ఏలూరు వేదికగా వైయస్సార్ సిపి పార్టీ బీసీ గర్జన బహిరంగ సభ భారీ ఎత్తున జరుగుతుంది.ఈ సభలో అధికార పార్టీ తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో వైఫల్యాలను ఎండగట్టిన జగన్ మరోవైపు తాను అధికారంలోకి వస్తే బీసీల కోసం ఏం చేయబోతున్నాడు అనే విషయాలు స్పష్టం చేశారు.

 Jagan Gives So Many Promises To Bc Communities-TeluguStop.com

బీసీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదేళ్ల కాలంలో చేస్తానని మాట ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయకపోగా ఎన్నికల ముందు కార్పొరేషన్ మోసం చేస్తున్నారని విమర్శించారు.అలాగే 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోయారని విమర్శించారు.

బీసీ విద్యార్థులకు ఇస్తానని చెప్పిన స్కాలర్షిప్లు కూడా ఐదేళ్ల కాలంలో సుమారు రెండు వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని వైసిపి అధినేత చేశారు.కార్పొరేషన్లో మాటనా భారీ అవకతవకలకి తెలుగుదేశం నేతలు పాల్పడ్డారని ఆరోపణలు చేసిన జగన్ తాను వస్తే ప్రస్తుతం బీసీల కోసం కార్పొరేషన్ అని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి బీసీల కోసం సప్న ఏర్పాటుచేసి సంవత్సరానికి 15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో 75 కోట్లు నిధులు అందిస్తానని హామీ ఇచ్చారు.

అలాగే బీసీ విద్యార్థులు అందరికీ కూడా హాస్టల్ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి ఎడ్యుకేషన్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.చట్ట సభల్లో కూడా బీసీలకు సమాన ప్రాధాన్యత లభించే విధంగా కేంద్రంలో తీర్మానం పెడతామని జగన్ బీసీ గర్జనలో హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube