లోక్ సభ ఎన్నికలకు రజినీకాంత్! 2021 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం!

తమిళనాడు రాజకీయాల్లో స్టార్ హీరోలైన కమల్ హాసన్ రజనీకాంత్ ప్రస్థానం ఇప్పటికే మొదలైంది.

కమల్ హాసన్ పార్టీ పెట్టి రాజకీయంగా తన వేగం పెంచి రానున్న లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు.

ఇక రజనీకాంత్ కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఇన్ని రోజులు ఊహాగానాలు వినిపించాయి.తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ల శకం ముగిసింది.

దీంతో ఆ స్థానం భర్తీ చేయడానికి ఇప్పుడు ఉన్న రాజకీయ స్పేస్ ని వినియోగించుకోవడానికి కమల్ హాసన్, రజనీకాంత్ సిద్ధమవుతున్నారు.ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికలకు మరో నెల రోజులు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

విలన్ టైం లో రజినీకాంత్ ఊహించిన నిర్ణయం తీసుకొని తన అభిమానులకు షాక్ ఇచ్చాడు.రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేసిన రజనీకాంత్, ఏ పార్టీ కూడా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం లేదని, ఎవరైనా తమ ఫొటోలను ఉపయోగించుకొని ప్రచారం నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీడియా ద్వారా స్పష్టం చేశారు.

Advertisement

ఇక తమ పార్టీ 2021 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని పని చేస్తుందని, ప్రస్తుతానికి తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని రజనీకాంత్ తెలియజేశారు.దీంతో ఇన్నిరోజులు తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ ట్రెండ్ సృష్టిస్తాడని భావించిన వారికి షాక్ తగిలిందని చెప్పాలి.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు