కన్నబిడ్డ పై అత్యాచారం! ఆపై ఆత్మహత్య!

మానవ బంధాలు ఎంత దారుణంగా నాశనం అయిపోతున్నాయో ఈ మధ్య కాలంలో తరచుగా జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే తెలుస్తుంది.కుటుంబ విలువలు, రక్త సంబంధాలకు కూడా విలువ లేకుండా అయిపోయింది.

 Father Physical Abusing The Daughter-TeluguStop.com

మగవారిలో పశుత్వం తల్లి కూతురు చెల్లి అనే వావివరసలను మరిచిపోయేలా చేస్తుంది.ఈ మధ్యకాలంలో దేశంలో ఇలాంటి ఘటనల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.

తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.అది కూడా మన హైదరాబాద్ లోనే.

హైదరాబాద్ నగర పరిధిలో జియాగూడ లో భంజీవాడికి చెందిన గణేష్ అనే 40 ఏళ్ల వ్యక్తి తన 13 ఏళ్ల కుమార్తె పై అత్యాచారానికి ఒడిగట్టాడు.ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది.

అప్పట్లో దీనిపై కేసు నమోదు కావడంతో ప్రస్తుతం ఈ కేసు విచారణ నాంపల్లి మెట్రోపాలిటన్ ముందుకు వచ్చింది.కోర్టులో నేరం అంగీకరించిన గణేష్ తనకి ఎలాగైనా శిక్ష ఖరారు అవుతుందని గ్రహించి తాజాగా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు తెలుస్తుంది.

గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube