హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో మొగుడు పెళ్లాల గొడవలు!

సాఫ్ట్వేర్ లోకం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కంప్యూటర్లతో కుస్తీ పడుతూ ప్రోగ్రామింగ్ కోడింగ్-డీకోడింగ్ ప్రోగ్రాం కి స్క్రిప్ట్ వంటి వ్యాపకాలతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నిత్యం బిజీ జీవితాన్ని గడుపుతుంటారు.

సాఫ్ట్వేర్ జాబ్ అంటేనే ముఖ్యంగా ఆలోచనతో చేయాల్సిన పని.

ఈ కారణంగానే సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు చాలా వేగంగా మానసిక ఒత్తిళ్లకు గురి అవుతుంటారు.ఈ మానసిక సమస్యలు కుటుంబ బంధాల పై కూడా ప్రభావం చూపిస్తుంటాయి.

ఈ కారణంగానే ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళ ఫ్యామిలీ జీవితం అంతగా బావుండదు అనేది మానసిక విశ్లేషకుల అభిప్రాయం.ఇదిలా ఉంటే హైదరాబాద్ లో సైబరాబాద్ కమిషనర్ పరిధిలో వందల సంఖ్యలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి.

అక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వేల సంఖ్యలో పని చేస్తుంటారు.అయితే సైబరాబాద్ కమిషనర్ పరిధిలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదవుతున్న కేసుల్లో భార్యాభర్తల గొడవలే ఉన్నాయని తెలుస్తుంది.

Advertisement

చిన్న చిన్న కారణాలకు ఇంట్లో గొడవలు పడుతూ పోలీస్ స్టేషన్ వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే భార్య భర్తలు వచ్చేస్తున్నారని సైబరాబాద్ పోలీసులు అంటున్నారు.వారి మధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నం చేస్తున్నా కూడా వారు అందుకు అంగీకరించకుండా కేసుల వరకు వెళ్తున్నారని సమాచారం.

సైబరాబాద్ కమిషనర్ పరిధిలో నమోదయ్యే కేసుల్లో 50 శాతం వరకు ఇలా భార్యాభర్తల గొడవలే ఉన్నాయని పోలీసులు తెలియజేయడం విశేషం.దీనిబట్టి కుటుంబ బంధాల లో డబ్బు మానసిక ఒత్తిడి ఎంత ప్రభావం చూపిస్తున్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది.

Advertisement

తాజా వార్తలు