ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఢిల్లీ వేదికగా ప్రత్యెక హోదా ఉద్యమానికి తెరతీసి కావాల్సిననత మైలేజ్ ని ఎన్నికల ముందు సొంతం చేసుకుంటున్నాడు.ప్రత్యెక హోదా, విభజన హామీలపై ఇప్పటి వరకు వైసీపీ, జనసేన, టీడీపీ ఎవరి పంథాలో వారు ఉద్యమం చేస్తున్నారు.
అయితే ఢిల్లీ వేదికగా చంద్రబాబు చేసిన ధర్మపోరాట దీక్షని విపక్షాల నుంచి మద్దతు లభించడంతో పాటు, నేషనల్ మీడియా ద్రుష్టి ని కూడా ఆకర్షించారు.దీంతో ప్రత్యెక హోదా సాధన కోసం టీడీపీ పార్టీ చేస్తున్న పోరాట ఉద్యమానికి ఏపీలో కూడా ప్రజల నుంచి సానుకూలత లభించింది.
ఇదిలా వుంటే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ భవన్ నుంచి రాష్ట్ర పతి భవన్ వరకు పాదయాత్ర చేసి ప్రత్యెక హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసన తెలియజేసారు.అలాగే రాష్ట్రపతి భవన్ లో 11 సభ్యుల బృందంతో కలిసి ప్రత్యెక హోదా, విభజన హామీలకి సంబంధించిన 18 డిమాండ్ల పత్రాల్ని రాష్ట్రపతికి అందించేసారు.
ఈ బృందంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు కూడా ఉంటారని నేషనల్ మీడియాతో చంద్రబాబు చెప్పడం జరిగింది.అదే సమయంలో బీజేపీకి వైసీపీ మద్దతుగ వుండటం కారణంగా, అవినీతి కేసుల నుంచి బయటపడటానికి మోడీ తొత్తులుగా వైసీపీ నాయకులు మారిపోయారని చంద్రబాబు ఘాటు విమర్శలు చేసారు.
మరి ఢిల్లీ వేదికగా వైసీపీప బాబు చేసిన విమర్శలకి ఆ పార్టీ ఎం సమాధానం చెబుతుందో చూడాలి.







