ఆహా... ఫేస్ బుక్ మెసెంజర్ లో మరో సరికొత్త అప్ డేట్

ఎప్పటికప్పుడు సరికొత్త మార్పు చేర్పులతో సోషల్ మీడియా యూజర్స్ ని ఆకట్టుకుంటున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఇప్పుడు సరికొత్త అప్ డేట్ ని తీసుకొచ్చింది.

వాట్స్ యాప్ లో ఏ విధంగా అయితే పంపిన మెస్సేజ్ ను తొలిగించడం కోసం డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్ తీసుకొచ్చారో అదే విధంగా.

ఫేస్ బుక్ మెసెంజర్ లో కూడా ఆ విధంగానే ఇదే ఆప్షన్ తీసుకొచ్చారు.మెస్సేజ్ పంపిన పది నిముషాల వ్యవధిలో దాన్ని డిలేట్ చేసేస్తే ఇక ఆ మెస్సేజ్ ఎవరికీ కనిపించదు.

ఇప్పటివరకు .స్నేహితులకు, బంధువులకు ఎంతోమందికి ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ నుంచి మెసేజ్ లు పంపిస్తూ ఉంటాం.ఈ సమయంలో అనుకోకుండా తప్పుగా మెసేజ్ పంపిన సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి.

మెసేజ్ పంపాల్సిన గ్రూపుకు బదులుగా పొరపాటున ఫేస్ బుక్ మరో గ్రూపులోకి మెసేజ్ ను పంపిస్తూ ఉంటాం.ఇక అటువంటి హైరానా ఇక పడనవసరం లేకుండా.

Advertisement

ఈ కొత్త విధానం యూజర్స్ కి సౌకర్యంగా ఉండబోతోంది.కాకపోతే ఈ ఆప్షన్ పొందాలంటే .ఇప్పుడు వాడుతున్న మెసెంజర్ ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సిందే.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు