కమలా హారీస్ సరికొత్త రికార్డ్...!!!

భారత సంతతికి చెందిన కమలా హారీస్ వచ్చే ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉందన్న విషయం అందరికి తెలిసిందే.అయితే కొన్ని నెలల నుంచీ ఆమె ప్రచారంలో మునిగిపోయింది.

 Kamala Harris Have Huge Response In America-TeluguStop.com

అయితే ఈ క్రమంలో ఆమె అమెరికాలో సరికొత్త రికార్డ్ సృష్టించారు.ప్రఖ్యాత సీఎన్‌ఎన్ టీవీ చానెల్‌లో , కమలా పాల్గొన్న టౌన్ హాల్ కార్యక్రమాన్ని ప్రజలు ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో వీక్షించారని ఆ ఛానెల్ ప్రకటించింది.

అయితే ఈ కార్యక్రమం సగటున చూసిన వారి సంఖ్య 19లక్షల చీలుకు ఉందని ఆ ఛానెల్ తెలిపింది.గతంలో నిర్వహించిన నాలుగు టౌన్ హాల్ కార్యక్రమాలకు ఈ సగటు 11లక్షలేనని సీఎన్‌ఎన్ ఓ ప్రకటనలో తెలిపింది.అయితే ఈ కార్యక్రమాన్ని అధికంగా 25 నుంచి 54ఏళ్ల మధ్య వయస్సు వారు చూశారని ప్రకటించింది.

కమలాని చాలామంది బరాక్ ఒబామాతో పోల్చుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.ఆమె విధానాలు ఎలా ఉండబోతున్నాయి.??? అమెరికా అభివృద్దికి ఆమె వ్యూహాలు ఏమిటి అనే అంశాలపై ఆమెని ఆ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది.అయితే అమెరికా చరిత్రలో ఎ ఒక్క రాజకీయ నేత పాల్గొన్న కార్యక్రమానికీ ఈ స్థాయిలో ప్రజలు ఆదరించలేదని ప్రముఖ నీల్సన్ సర్వే సంస్థ ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube