ఏపీలో వైసీపీకి 23 ఎంపీ స్థానాలు వస్తాయంటూ తప్పుడు సర్వేలు చేస్తున్నారని ఐటీ మంత్రి లోకేష్ మండిపడ్డారు.2014లో టీడీపీ ఓడిపోతుందని అనేక సర్వేలు చెప్పాయని.కానీ గెలిచామని లోకేష్ గుర్తు చేశారు.అసలు కేంద్ర మంత్రులే ఏపీ పని తీరు బాగుందని మెచ్చుకుంటున్నారని బాబు చెప్పారు.బీజేపీ రాష్ట్ర నేతలకు రాష్ట్రాభివృద్ధి కనిపించడం లేదని లోకేశ్ విమర్శించారు.
రాష్ట్రాభివృద్ధి కోసం పాలసీ ప్రకారమే భూముల కేటాయింపులు జరుగుతాయని, రూ.5 కోట్లకు ఎకరం ఇస్తే పెట్టుబడి పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారని లోకేశ్ ప్రశ్నించారు.హైదరాబాద్లో హైటెక్ సిటీకి భూమి కేటాయించినప్పుడు కూడా విమర్శించారని లోకేశ్ తెలిపారు.
తాజా వార్తలు