కాంగ్రెస్ సీనియర్ నాయకుడు … రాయలసీమ కీలక నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధం అయ్యారు.ఈ నేపథ్యంలోనే… సూర్యప్రకాష్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్ర బాబు అపాయింట్మెంట్ ఇచ్చారు.
అయితే కోట్ల చేరికపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలక వహించారు.కేఈ కృష్ణమూర్తికి సమాచారం లేకుండానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి అపాయింమెంట్ ఇచ్చారు.
టీడీపీలో కోట్ల కుటుంబం రాకను చాలా కాలంగా వ్యతిరేకిస్తు వస్తున్న కేఈ కృష్ణమూర్తికి ఈ వ్యవహారం నచ్చలేదు.

అందుకే… టీడీపీలోకి కోట్ల రాకపై కేఈ కృష్ణమూర్తి సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.టీడీపీలో కోట్ల కుటుంబం చేరికపై తనకెలాంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు.ఈ విషయంలో తనపై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు.
కేఈ అలక నేపథ్యంలో… కోట్ల ను చేర్చుకునే విషయంలో చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.