మరోసారి నోరు జారిన అలీ...సుమ భర్త గురించి అలా అనేసారు ఏంటి.?

ప్రియా ప్రకాష్‌ వారియర్, నూరిన్‌ షరీఫ్, రోషన్‌ ముఖ్య తారలుగా ఒమర్‌ లులు దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్‌ లవ్‌’.ఈ చిత్రాన్ని ‘లవర్స్‌ డే’ పేరుతో సుఖీభవ సినిమాస్‌ పతాకంపై ఎ.

 Comedian Ali Vulgar Comments On Anchor Suma-TeluguStop.com

గురురాజ్, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు.షాన్‌ రెహమాన్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌ విడుదల చేశారు.

అయితే ఈ ఈవెంట్ ని సుమతో కలిసి అలీ గారు కూడా హోస్ట్ చేసారు.ఇలాంటి ఫంక్షన్స్ లో నోరుజారడం అలీ గారికి కొత్తేమి కాదు.హీరోయిన్స్,యాంకర్స్ వద్ద నోరు జారడం తర్వాత విమర్శలు ఎదురుకోవడం ఆయనకి కామన్.తాజాగా రాజీవ్ కనకాల గురించి కూడా అలాంటి ఓ కామెంట్ చేసి విమర్శలు ఎదురుకుంటున్నారు అలీ.

కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ ప్రియా ప్రకాష్ ని వేదికపైకి పిలిచిన సుమ ఆమెని తన చెల్లెలుగా అభివర్ణించింది.సుమ కూడా కేరళ వాసి కావడంతో మలయాళీ కుట్టి అయిన ప్రియాను తన సోదరి అంటూ మాట్లాడింది.

అదే సమయంలో మైక్ అందుకున్న అలీ ‘ప్రియా వారియర్ నీ చెల్లెలు ఓకే.మరి హీరో రోషన్ మీ కొడుకా’ అని సుమని ప్రశ్నించాడు.

కొడుకు లాంటివాడే అని సుమ తెలివిగా బదులిచ్చింది.అప్పుడు అలీ సైలెంట్ అవ్వకుండా.‘రాజీవ్ కేరళ ఎప్పుడు వెళ్లాడు.ఇంత పెద్ద కొడుకు ఉన్నాడు’ అని సుమ భర్త రాజీవ్ కనకాలపై అభ్యంతరకర కామెంట్స్ చేశాడు.ఇక ఈ విషయం పెద్దది అవ్వకూడదు అని సుమ వెంటనే టాపిక్ చేంజ్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube