దేశ వ్యాప్తంగా ఎంతో మంది దొంగ బాబాలు వస్తూనే ఉన్నారు, ప్రతి రోజు దొంగ బాబాల గుట్టు రట్టు అవుతూనే ఉంది.బాబాల చేతిలో మోసపోయిన వారు ఎంతో మంది మీడియాల ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నా కూడా ఇంకా కొందరు బాబాల చేతిలో మోసపోతూనే ఉన్నారు.
నెల్లూరుకు చెందిన ఈ ఘరానా మోసగాడు చేసిన మోసం గురించి తెలిసి పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు.అరే ఇలా కూడా మోసం చేయవచ్చా అంటూ అవాక్కయి మరీ చూస్తున్నారు.

ఈ ఘరానా మోసగాడి అసలు పేరు ఐద్వెత ప్రక్రియ గిరీష్.తాను ఇండియాలోని ప్రముఖ శ్రీమంతుల్లో ఒక్కడిని అంటూ చెప్పుకొచ్చాడు.మీడియాల్లో ప్రముఖుల ఫొటోల పక్కన తన ఫొటోలు వచ్చేలా చూసుకున్నాడు.దేశంలో టాప్ టెన్ ధనవంతుల జాబితాలో గిరీష్ కూడా ఉన్నాడంటూ నమ్మించాడు.హైదరాబాద్‌లో ఎంతో మందిని తానో ధనవంతుడిని అంటూ మోసం చేసిన గిరీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు.మొదట తాను ఒక దైవాంశ సంభూతుడిని, దైవ దూతను అంటూ ప్రచారం చేసుకుని, వందలాది మందిని తన భక్తులుగా మార్చుకున్నాడు.
అన్ని రోగాలను తన దివ్య శక్తితో నయం చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.

10 వేల నుండి రెండు లక్షల వరకు వసూళ్లు చేస్తూ ఈ దొంగ బాబా వందల కోట్లు వసూళ్లు చేశాడు.ఇక బిజినెస్ అంటూ సామాన్యులను చైన్ సిస్టం ద్వారా చేర్పించుకున్నాడు.వేలాది మంది ఈ కంపెనీలో చేరారు.
నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా వెనక్కు రాక పోవడంతో కొందరు పోలీసులను ఆశ్రయించారు.మొత్తం రెండు వేల మందిని ఈ దొంగ బాబా మోసం చేసి దాదాపు 500 కోట్ల వరకు నొక్కినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

ప్రతి రోజు ఇలాంటివి చూస్తూనే ఉంటాం, అయినా కూడా కాస్తయినా జాగ్రత్త పడకుండా ఇలా మోస పోవడం ఏంటో, ఇలాంటి అమాయకులు, ఈజీ మనీ కోసం ఆరాటపడే వారు ఉన్నంత కాలం దొంగ బాబాలు పుట్టుకు వస్తూనే ఉంటారు.







