టీఆర్ఎస్ – వైసీపీ పార్టీల మధ్య ఏర్పడిన స్నేహ బంధంపై అనేక రాజకీయ విమర్శలు చెలరేగుతున్నా… వైసీపీ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు.ఎన్ని విమర్శలు చెలరేగినా… టీఆర్ఎస్ సపోర్ట్ తో ఏపీలో అధికారం దక్కించుకోవాలని వైసీపీ అధినేత జగన్ చూస్తున్నాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో … అధికార పార్టీ టీడీపీ దూకుడుని అడ్డుకోవడం తన ఒక్కడివల్ల కాదని… అందుకే … టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకోవాలని జగన్ చూస్తున్నాడు.
అయితే వైసీపీ – టీఆర్ఎస్ స్నేహబంధం వల్ల వైసీపీకి కలిసొచ్చే అంశాలేంటి కలిసిరాని అంశాలేంటి అనే లెక్కలు మొదలయ్యాయి.అసలు ఈ రెండు పార్టీల స్నేహం గురించి వైసీపీ నాయకుల్లోనే సదభిప్రాయం కనిపించడంలేదు.ఇప్పటివరకు టీడీపీని ఒంటరిగానే ఎదుర్కొన్నామని … ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆ పార్టీతో అందునా ఏపీ ప్రజల్లో అంత సదభిప్రాయం లేని పార్టీతో కలిసి ముందుకు వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఒక వైపు చూస్తే… టీడీపీ అనేక ప్రజాకర్షక పథకాలను అమలు చేస్తూ… ఎన్నికలకు ఉత్సాహంగా ముందుకు దూసుకుపోతోంది.కడపలో ఉక్కుఫ్యాక్టరీకి శంకుస్థాపన … కర్నూల్‌లో ఎయిర్‌పోర్టు, సోలార్ పార్కులకు ప్రారంభోత్సవాలు చేపట్టారు.అలాగే… ప్రకాశం జిల్లాలో కాగిత పరిశ్రమ, రామాయపట్నం పోర్టులకు శంకుస్థాపనలు నిర్వహించారు.అంతేకాకుండా … పెన్షన్ల పెంపు వంటి కార్యక్రమాలు, పథకాలు చంద్రబాబు ప్రకటించారు.ఈ కొత్త పథకాలతో టీడీపీ శ్రేణుల్లో మళ్లీ జోష్ పెరిగింది.ఇప్పటికే… జగన్ పాదయాత్ర ముగింపు సభతో కొంత ఉత్సాహంగా ఉన్నవైసీపీ ఈ విధంగా టీడీపీ స్పీడ్ పెంచడంతో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి.ఏ కొత్త కొత్త హామీలు ఇవ్వాలి అనే కసరత్తులో మునిగిపోయారు.
ఇక ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ తలదూరుస్తామని చెప్పడం… దానికి జగన్ ఉత్సాహంగా ఒకే చెప్పడం పార్టీ నాయకులకు రుచించడంలేదు.సంక్రాంతి సందర్భంగా ఇటీవల ఏపీకి వచ్చిన టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు వైసీపీ పెద్దలు ఘనస్వాగతం పలకడం వంటి ఘటనలు పార్టీలోని మెజారిటీ నేతలకు మింగుడుపడంలేదు.ఈ పరిణామంపై తెలుగుదేశం పార్టీ నేతలు.
ముఖ్యంగా దేవినేని ఉమ, కాలువ శ్రీనివాసులు వంటి మంత్రులు స్పందించారు.
ఏపీ ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీ కలిసి రాజకీయం చేయబోతున్నాయనీ, ఆంధ్రావాళ్లను పదేపదే దూషించిన కేసీఆర్, కేటీఆర్‌లతో జగన్ ఎలా చేతులు కలుపుతారనీ వారు నిలదీశారు.
దీనిపై ఒకరకంగా ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తోంది.అదీ కాకుండా సోషల్ మీడియాలో ఏపీ ప్రజలను కేసీఆర్ దూషించిన క్లిప్పింగ్స్ ను పోస్టింగ్స్ పెడుతున్నారు.
ఇది కూడా వైసీపీ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేస్తోందని బాధపడిపోతున్నాడు ఆ పార్టీ నాయకులు.