కూతురి కళ్ళ ముందే తండ్రి మృతి...! ప్లీజ్‌ ..దండం పెడతా.. మా నాన్నను బతికించండి! కన్నీటి సంఘటన.!

ఆయన నిరుపేద న్యాయవాది.ఇద్దరు కుమార్తెలు.

ఉండేందుకు ఇల్లు కూడా సరిగా లేదు.

శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఉంటూనే పిల్లలకు ఉన్నత విద్యాభ్యాసం.

కేసులు వస్తేనే భోజనం చేసేవారు.ప్రతి రోజు మాదిరిగానే చిన్నకూతురును కాలేజీకి తన పాత స్కూటర్ పై తీసుకువెళ్తున్నాడు.

కానీ మృత్యువు చేరువలోనే ఉందని గుర్తించలేకపోయారు.ద్విచక్రవాహనం రూపంలో మృతువు ఆయన చెంతకు చేరింది.

Advertisement

ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.తన తండ్రి మృతిచెందిన విషయం తెలియక ‘‘నాన్నా కాలేజీ బస్సు వచ్చింది లే’’ అంటూ ఏడుస్తూ రక్తపుమడుగులో పడి ఉన్న తన తండ్రిని లేపుతూ రోదిస్తుంటే ఆ దారిగుండా వెళ్లే పలువురు కంటతడి పెట్టారు.

కన్నీరు తెప్పించే ఈ ఘటన నగరంలోని నారాయణగూడ లో చోటుచేసుకుంది.

వివరాల లోకి వెళ్తే.సుల్తాన్‌బజార్‌లోని జైన్‌మందిర్‌ వెనుకాల రేకుల ఇంట్లో రాణాప్రవీర్‌కుమార్‌(58) నివాసం ఉంటున్నాడు.ఈయనకు భార్య అనురాధ, పెద్దకూతురు చందన, చిన్నకూతురు శివాని ఉన్నారు.

చిన్నకూతురు బాచుపల్లిలోని గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది.ఈమెను ప్రతి రోజూ తన పాత ద్విచక్రవాహనంపై నారాయణగూడ వరకు తీసుకొచ్చి కాలేజీ బస్సు ఎక్కించేవారు.రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం 7.30గంటలకు ఇంటి నుంచి రామ్‌కోఠి మీదుగా నారాయణగూడ జలమండలి కార్యాలయం వరకు రాగానే బస్సు కోసం ఎదురుచూస్తున్న రాణాప్రవీర్‌కుమార్‌ స్కూటర్‌ను ఎదురుగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి బుల్లెట్‌ వాహనంతో బలంగా ఢీకొట్టాడు.దీంతో స్కూటర్‌పై ఉన్న తండ్రీకూతుళ్లు రోడ్డుపైన పడిపోయారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ ప్రమాదంలో రాణాప్రవీర్‌కుమార్‌ తలకు బలమైన గాయాలు తగిలి రక్తపు మడుగులో కొట్టుకుంటూ అక్కడే తుది స్వాశ విడిచారు.ఎడమచేయికి బలమైన గాయమైన శివాని తన తండ్రిని రక్షించాలంటూ అరుపులు పెట్టింది.

Advertisement

అక్కడే ఉన్న స్థానికులు 108, పోలీసులకు సమాచారం అందించారు.బులెట్ వాహన వ్యక్తి వెంటనే అక్కడి నుండి పరారయ్యాడు.

పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రాణాప్రవీర్‌కుమార్‌ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.శివానిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చేతులకు కట్టుకట్టించారు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు.కాగా న్యాయవాదిగా రాణాప్రవీర్‌కుమార్‌కు మంచి పేరుంది.అలాగే ఆయన కుమార్తెలు కూడ ట్యూషన్లు చెబుతూ కళాశాలల్లో ఫీజులు కట్టుకునే వారని పలువురు చెప్పారు.

కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయా.ఇప్పుడు మాకు దిక్కెవరు అంటూ రాణాప్రవీర్‌కుమార్‌ భార్య అనురాధ రోదించారు.

ఇంజనీరింగ్‌ పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను బాగా చూసుకుంటామని ప్రతీసారి తండ్రికి చెప్పేదాన్ని అంటూ పెద్ద కూతురు కంట తడి పెట్టుకుంది.ప్రత్యక్ష సాక్ష్యులు అయిన మృతుడి చిన్న కూతురు మాట్లాడుతూ.

"మూడేళ్లుగా మా నాన్న స్కూటర్‌పైనే కళాశాల బస్సువద్ద వదిలివెళ్లేవాడు.నేను బాచుపల్లిలోని గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదవుతున్నాను.

చివరి సంవత్సరం పూర్తికాగానే మంచి ఉద్యోగంలో చేరి ఉన్నతంగా చూసుకుంటానని వాహనంపై వెళ్లేటప్పుడు ప్రతి రోజూ నాన్నకు చెప్పేదాన్ని.శుక్రవారం కూడా ఇద్దరం మాట్లాడుకుంటూ రామ్‌కోఠి నుంచి నారాయణగూడ వద్దకు రాగానే వేగంగా దూసుకువచ్చిన బుల్లెట్‌ వాహనం మా నాన్న స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది.

దీంతో ఇద్దరం స్కూటర్‌ పై నుంచి రెప్పపాటులో ఎడమవైపు పడిపోయాం.నాన్న తలకు బలమైన గాయం కావడంతో రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ నా ముందే ప్రాణాలు వదిలాడు.

తాజా వార్తలు