కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ చిత్రంను నందిని రెడ్డి రీమేక్ చేయబోతుందని, సురేష్ బాబు అందుకు సంబంధించిన నిర్మాణ పనులు చూసుకుంటున్నాడు.సమంత గ్రానీ పాత్రను పోషించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.
నందిని రెడ్డి కూడా తన గ్రానీ సినిమాకు సంబంధించిన విషయాలను సన్నిహితుల వద్ద చర్చిస్తున్న సమయంలో సమంత దాదాపుగా ఫైనల్ అయ్యిందని చెప్పుకొచ్చింది.

కాని అనూహ్యంగా సినిమా నుండి సమంత తప్పుకుంది.మరీ గ్రానీగా నటించడం అంటే మామూలు విషయం కాదు, స్టార్ డం ఉన్న సమంత ఇలాంటి సాహసాలు చేస్తే కెరీర్‌కే ప్రమాదం అనే ఉద్దేశ్యంతో ఆ సినిమాను కాదంది.

గ్రానీ పాత్రకు నో చెప్పిన సమంత ఇప్పుడు ఆంటీ పాత్రకు ఓకే చెప్పింది.తమిళ బ్లాక్ బస్టర్ ’96’ చిత్రం రీమేక్ లో త్రిష పోషించిన పాత్రను సమంత పోషించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయ్యాయి.96 చిత్రంలో పెళ్లి అయ్యి, పిల్లలు కూడా ఉన్న అమ్మాయిగా కనిపించింది.ఇప్పుడు సమంత అదే విధంగా కనిపించబోతుంది.
ఈ రీమేక్ లో విజయ్ సేతుపతి పాత్రను చేసేందుకు శర్వానంద్ చాలా రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.భారీ అంచనాల నడుమ ఈ రీమేక్‌ను దిల్‌రాజు నిర్మించబోతున్నాడు.

సమంత ఈమద్య కాలంలో గ్లామర్ రోల్స్ కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎక్కువగా చేసేందుకు ఆసక్తి చూపుతుంది.అందుకే 96 రీమేక్‌కు ఒప్పుకుంది.ఆ చిత్రంలో త్రిష అద్బుతమైన నటనను కనబర్చింది.ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ప్రేక్షకులకు కన్నీరు తెప్పించింది.అంతటి నటన ఆస్కారం ఉన్న సినిమా అవ్వడం వల్లే ఈ సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన రామ్ కుమార్ తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించబోతున్నాడు.
శర్వానంద్, సమంతల జోడీ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.త్వరలోనే దిల్‌రాజు అధికారికం ప్రకటిస్తాడని సమాచారం అందుతోంది.







